తెలంగాణ

telangana

'దేవర'లో ఐటమ్ సాంగ్- స్టార్ హీరోయిన్​ కన్ఫార్మ్! - Devara Item Song

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 10:01 AM IST

Updated : Apr 22, 2024, 11:40 AM IST

Devara Item Song: ఎన్టీఆర్ లీడ్​ రోల్​లో స్టార్ దర్శకుడు శివ కొరటాల తెరకెక్కిస్తున్న సినిమా దేవర. అయితే డైరెక్టర్ శివ ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్​ను కన్ఫార్మ్ చేసినట్లు టాక్.

Devara Item Song
Devara Item Song

Devara Item Song:గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'దేవర'పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా గురించి రోజులో వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తోంది. తాజాగా సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేటైంది. ఈ సినిమాలో డైరెక్టర్ శివ ఐటమ్ సాంగ్​ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్​లో స్పెప్పులేయనున్నది ఎవరో తెలుసా?

దేవర ఐటమ్ సాంగ్​ కోసం శివ గట్టిగానే సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారట. అందులో బుట్టబొమ్మ బ్యూటీ 'పూజా హెగ్డే', స్టార్ హీరోయిన్ 'కాజల్ అగర్వాల్' పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కాజల్ ఇదివరకే శివ దర్శకత్వం వహించిన జనతా గ్యారేజ్ మూవీ 'పక్కా లోకల్' పాటకు స్పెప్పులేసింది. మరోవైపు రంగస్థలంలో 'జిగేలు రాణి' సాంగ్​కు పూజా ఆడిపాడి ప్రేక్షకులను అలరించింది. దీంతో ఈ ఇద్దరిలో శివ ఎవరిని ఎంపిక చేసినా, సాంగ్ ఔట్​పుట్ అదిరిపోతుందని మూవీ లవర్స్ అంటున్నారు. అయితే ఎన్టీఆర్ సరసన స్టెప్పులేసేందుకు పూజా ఇప్పటికే ఛాన్స్ కొట్టేసినట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, వీడియో గ్లింప్స్​కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇటీవల గోవాలో ముఖ్యమైన షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్​లో యాక్షన్​ సీన్స్​తోపాటు ఓ సాంగ్ చిత్రీకరించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. మరాఠా భామ శ్రుతి మరాఠే కూడా కీ రోల్​ చేయనుంది. వీరిద్దరూ ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ నటులు సైఫ్ అలీ ఖాన్ సినిమాలో కీలకమైన పాత్ర పోషించనున్నారు. సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మురశీ శర్మ తదితరులు ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్​పై రూపొందుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ సినిమా 2024 అక్టోబర్ 10న వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

వాట్​ ఏ ప్లానింగ్ 'దేవర' - ఆయన చేతికి నార్త్ థియేట్రికల్ రైట్స్​ - NTR Devara

'దేవర' రిలీజ్ ఆలస్యమైనా మీరందరూ కాలర్ ఎగరేస్తారు'- ఫ్యాన్స్​లో జోష్ నింపిన ఎన్టీఆర్ - Jr NTR Devara

Last Updated : Apr 22, 2024, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details