తెలంగాణ

telangana

బాలయ్యపైనే ఆ హీరోయిన్ ఆశలన్నీ! - Balakrishna Akhanda 2

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 10:36 PM IST

Balakrishna Akhanda 2 Heroine : వరుసపెట్టి సినిమాల్లో నటించినా ఒక్క హిట్ దక్కించుకోలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా ఆమె చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడామె ఆశలన్నీ బాలయ్యపైనే ఉన్నాయి. పూర్తి వివరాలు స్టోరీలో.

Balakrishna Akhanda 2 Heroine
.

Balakrishna Akhanda 2 Heroine :కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న నటి ప్రగ్యా జైస్వాల్. అంతకుముందు ఆ తర్వాత ఆమె చాలా సినిమాల్లో నటించారు. అయితే ఆమె కెరీర్​లో కంచె, అఖండ సినిమాలు మినహాయిస్తే చెప్పుకోదగ్గ హిట్ లేకుండాపోయింది. ఈ ముద్దుగుమ్మ నటించిన మిర్చి లాంటి కుర్రాడు, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా సినిమాలన్నీ బాక్సీఫీసుకు పెద్దగా అంతగా కలెక్షన్లు తెచ్చి పెట్టలేదు. బాలీవుడ్​లోనూ ఈమె నటించిన టిట్టూ ఎంబీఏ కూడా ప్లాప్ అవడంతో అక్కడ కూడా ఈమె ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. ఇవేకాకుండా ఆచారి అమెరికా యాత్ర, సైరా, సన్ ఆఫ్ ఇండియా లాంటి సినిమాల్లో నటించింది ప్రగ్యా. చివరిగా అఖండతో భారీ విజయాన్ని అందుకున్న ఈమె ఆ తర్వాత స్క్రీన్​పై ఇప్పటివరకు కనిపించలేదు.

అయినా నిరాశ చెందని ప్రగ్యా ఆఫర్లు చేజిక్కించుకోవాలనే తాపత్రయంతో సోషల్ మీడియా వేదికగా యాక్టివ్​గానే ఉంటోంది. ఏ మాత్రం పొదుపు లేకుండా అందాల ఆరబోతలో, హాట్ హాట్ ఫోజులతో దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తోంది. ఇవి కుర్రకారును రెచ్చగొట్టే రేంజ్​లో ఉన్నప్పటికీ దర్శక నిర్మాతలను ఆకట్టుకోలేకపోతున్నాయేమో. ఈ మధ్య కాలంలో ఆమె దగ్గరుకు ఎలాంటి ఆఫర్లు లేక అమ్మడు ఖాళీగానే ఉంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే కెరీర్‌లో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడు ఆశలన్నీ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అఖండ 2పైనే ఉన్నాయని అంటున్నారు. ఎన్​బీకే 110గా ఇది రూపొందే అవకాశం ఉంది. ఇప్పటికే అఖండ 2 సినిమా గురించి బోయపాటి కూడా కన్ఫామ్ చేసేశారు. తొలి పార్ట్‌లోని కథనే కొనసాగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ప్రగ్యా పంట పండినట్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి భాగంలో డ్యూయెల్ రోల్‌లో కనిపించే బాలయ్య బాబు(రైతు) పాత్రకు జోడీగా ఈమె కనిపించి మెప్పించారు. కాబట్టి పార్ట్-2 వస్తే కథలో ఆమె ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కథ మారితే చెప్పలేం. ఏదైమైనా అఖండ టీం దీని గురించి అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చే వరకు ప్రగ్యా ఎదురుచూస్తూ ఉండాల్సిందే.

కాగా, బాలయ్య - బోయపాటి కాంబినేషన్​లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు ఎంత సక్సెస్ సాధించాయో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసిందే. దీంతో అఖండ సీక్వెల్​పై భారీ అంచనాలు ఉన్నాయ్. దీనిపై ఇటీవల మీడియాతో మాట్లాడిన బోయపాటి శ్రీను - "ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే సినిమా షూటింగ్ మొదలవుతుంది. తొలి పార్ట్‌లో పసిబిడ్డ, ప్రకృతి, పరమాత్మ అంశాలను చూపించాం. రెండో పార్ట్ (అఖండ - 2)లో సమాజానికి అవసరమైన దైవత్వంతో కూడిన మంచి సందేశాన్ని చూపించబోతున్నాం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. సీక్వెల్ కూడా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని" అని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details