తెలంగాణ

telangana

RRRపై హాలీవుడ్ భామ ప్రశంసలు - ఎన్టీఆర్​, ​చరణ్​తో నటించాలని ఉందంటూ! - Anne Hathaway

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 7:55 PM IST

Anne Hathaway RRR Movie NTR Ramcharan : ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది హాలీవుడ్ నటి అన్నే హత్వే. ఆర్ఆర్ఆర్ స్టార్స్​ రాజమౌళి, ఎన్టీఆర్​, రామ్​ చరణ్​తో కలిసి పని చేయాలని ఉందని తమ మనసులో మాటను తెలిపింది.

.
.

Anne Hathaway RRR Movie NTR Ramcharan :ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది హాలీవుడ్ నటి అన్నే హత్వే. ఆర్ఆర్ఆర్ స్టార్స్​ రాజమౌళి, ఎన్టీఆర్​, రామ్​ చరణ్​తో కలిసి పని చేయాలని ఉందని తెలిపింది. న్యూయార్క్ నగరంలో "ది ఐడియా ఆఫ్ యూ" సినిమా ప్రీమియర్ షోకు హాజరైన ఆమె ఈ కామెంట్స్ చేసింది. అలానే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా పట్ల తనకున్న అంతులేని అభిమానాన్ని కూడా తెలిపింది. ప్రియాంకతోనూ కలిసి నటించాలని, డ్యాన్స్ వేయాలని ఉందని చెప్పుకొచ్చింది.

అలానే సినిమా సెట్​లో అందరితో కలిసి మెలిసి ప్రశాంతంగా ఉండటం వెనక రహస్యాన్ని కూడా తెలిపింది అన్నే హత్వే. తనలో ఉన్న కృతజ్ణతా భావమే ఇందుకు కారణమని చెప్పింది. "నేను ఎప్పుడూ కృతజ్ణతా భావంతోనే ఉంటాను. కానీ దానికంటూ ఓ లిమిట్​ను ఏర్పరుచుకుని మెదులుతాను. ఎందుకంటే నాకు కూడా కుటుంబం ఉంది. మా కుటుంబ విలువలను కాపాడే బాధ్యత నాపై ఎప్పుడూ ఉంటుంది." అంటూ తన ఆలోచనలను పంచుకుందీ అమెరికన్ నటి.

కాగా, ప్రస్తుతం రొమాంటిక్ కామోడీ నేపథ్యంలో తెరకెక్కిన "ది ఐడియా ఆఫ్ యూ" సినిమాలో అన్నే హత్వే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి మైఖేల్ షోవాల్టర్ దర్శకత్వం వహించారు. ది ఐడియా ఆఫ్ యూ చిత్రాన్ని రాబిన్ లీస్ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో ప్రముఖ హాలీవుడ్ హీరో నికొలాస్ గాలిట్జిన్ కథానాయకుడిగా కనిపించనున్నారు. మే2 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక తారక్, రామ్ చరణ్​ల విషయానికొస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత వీళ్లిద్దరి రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో తారక్ సరసన శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్​గా కనిపించనున్నారు. మరోవైపు శంకర్​ రామ్ చరణ్ కాంబోలో గేమ్ ఛేంజర్ సినిమా రాబోతుంది. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్​గా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉన్నాయి.

స్టేజ్​పైనే కన్నీళ్లు పెట్టుకున్న 'యానిమల్' విలన్ - Bobby Deol cries

మేం ముగ్గురం కలిసి సినిమా చేస్తాం : ఖాన్ త్రయం! - Aamir Salman Sharukh

ABOUT THE AUTHOR

...view details