తెలంగాణ

telangana

సినిమా షూటింగ్​లో నిజంగానే పాము కాటు - ఆ సెన్సేషనల్​ మూవీకి 25 ఏళ్లు

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 5:29 PM IST

Actress Prema Devi Movie Shooting : తాను నటించిన సూపర్ హిట్ సెన్సేషనల్ మూవీ షూటింగ్​లో నిజంగానే ఓ వ్యక్తి పాము కాటుకు గురై కన్నుమూసినట్లు తెలిపింది నటి ప్రేమ. ఆ వివరాలను తెలుసుకుందాం.

సినిమా షూటింగ్​లో నిజంగానే పాము కాటు - ఆ సెన్సేషనల్​ మూవీకి 25 ఏళ్లు
సినిమా షూటింగ్​లో నిజంగానే పాము కాటు - ఆ సెన్సేషనల్​ మూవీకి 25 ఏళ్లు

Actress Prema Devi Movie Shooting Snake Bite : ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన సోషియో ఫాంటసీ చిత్రం దేవి. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ ప్రేమ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.

"ఆ రోజుల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలా తక్కువగా వచ్చేవి. ఆ సమయంలో వచ్చిన ఈ దేవి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అంత పెద్ద విజయం సాధించడానికి మెయిన్ రీజన్ కోడి రామకృష్ణ గారే. సీన్ బాగా వచ్చే వరకూ 50 టేక్‌లు అయినా తీస్తారు. డే అండ్ నైట్ సినిమా కోసం పని చేశాను. డైలాగ్​లు కూడా బాగా ప్రాక్టీస్‌ చేయించేవారు. అయితే అప్పుడు. ఇలాంటి పాముల సినిమాలు ఎవరు చూస్తారని అంతా అనుకున్నాం. కానీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక నేనే సర్​ప్రైజ్ అయ్యాను. చిత్రీకరణ సమయంలో ఒక వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది. అతడిని హాస్పిటల్​కు తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. దీంతో రెండు రోజుల పాటు షూటింగ్‌ కూడా ఆపేశాం. క్లైమాక్స్‌ కోసం మంచులో చాలా ఇబ్బందులు పడ్డాం" అని అన్నారు.

ఇంకా తన సినీ కెరీర్ గురించి కూడా మాట్లాడుతూ ప్రేమ. "ఎయిర్‌హోస్టెస్‌ అవ్వాలనేది నా డ్రీమ్. కానీ మా అమ్మకు మాత్రం నేను నటి అవ్వాలని ఉండేది. ఆ విషయంలో చాలా సార్లు మా ఇద్దరికీ గొడవ కూడా అయింది. ఫైనల్​గా ఆమె కలను నెరవేర్చాలని సవ్యసాచి అనే కన్నడ సినిమాలో యాక్ట్ చేశాను. కానీ అది నిరాశ పరిచింది. అయినా ఓం చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌. ఇక ధర్మచక్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణ క్షణం చిత్రాలు చేయలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది" అని పేర్కొన్నారు.

అందుకే గుండు కొట్టించుకున్నా - వెక్కి వెక్కి ఏడ్చిన నటి సురేఖ

అల్లు అర్జున్​తో పాన్ ఇండియా సినిమా! అట్లీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

ABOUT THE AUTHOR

...view details