ETV Bharat / entertainment

అందుకే గుండు కొట్టించుకున్నా - వెక్కి వెక్కి ఏడ్చిన నటి సురేఖ

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 3:23 PM IST

Actress Surekha Vani Emotional Comments : నటి సురేఖా వాణి తాజా ఇంటర్వ్యూలో వెక్కి వెక్కి ఏడ్చించి. తాను ఎందుకు గుండు కొట్టించుకోవాల్సి వచ్చిందో వివరించింది. ఇంకా మరిన్ని విషయాలను చెప్పింది. ఆ వివరాలు.

అందుకే గుండు కొట్టించుకున్నా - వెక్కి వెక్కి ఏడ్చిన సురేఖ
అందుకే గుండు కొట్టించుకున్నా - వెక్కి వెక్కి ఏడ్చిన సురేఖ

Actress Surekha Vani Emotional Comments : టాలీవుడ్ నటి సురేఖా వాణి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మందికి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. అమ్మగా, అక్కగా, పిన్నిగా, వదినగా ఇలా స్టార్ హీరో సినిమాల్లో ఎన్నో సార్లు కనపడిన ఈమె ఈ మధ్య తక్కువగా చిత్రాలు చేస్తోంది. అయినా కూడా లగ్జరీగా లైఫ్​ గుడుపుతూ తన కూతురు సుప్రియతో కలిసి చిల్ కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. 40ఏళ్ల వయసులోనూ సోషల్ మీడియాలో మోడర్న్​ డ్రెస్​లతో రీల్స్​ చేస్తూ సందడి చేస్తోంది. దీంతో తరచుగా ఆమెపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. తన భర్త చనిపోయాక అత్తారింటి నుంచి కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. తాజాగా వీటిపై ఆమె ఓ ఇంటర్ల్యూలో మాట్లాడింది. అలాగే గ్లామర్ ఫీల్డ్​లో ఉన్న తాను ప్రస్తుతం ఎందుకు గుండు కొట్టించుకుందో కూడా వివరించింది.

గతంలో వయసులో ఉన్నప్పుడు సురేఖ చాలా సినిమాలు చేస్తూ కెరీర్​లో బిజీగా ఉండేది. అలాంటి సందర్భంలో తాను గుండు చేయించుకున్నానని ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే చేయించుకున్నట్లు తెలిపింది సురేఖ. తన భర్తను ప్రేమించిన సమయంలో ఆయనతో పెళ్లి జరిగితే గుండు కొట్టించుకుంటానని తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నట్లు చెప్పింది. అలానే తనకు పెళ్లయ్యాకా కెరీర్​ ఫుల్​ బిజీగా ఉన్నా మొక్క ప్రకారం గుండు కొట్టించుకున్నట్లు గుర్తుచేసుకుంది. ప్రస్తుతం తన లైఫ్​ ఎన్నో కాంట్రవర్సీలతో ముందుకు వెళ్తుందని కాస్త ఎమోషనల్ అయిన సురేఖ - వాటి నుంచి బయటపడాలని, జీవితం హాయిగా సాఫీగా సాగాలని మరోసారి దేవుడిని మొక్కుకుని గుండు చేయించుకున్నట్లు తెలిపింది.

"నా భర్తను నేను చాలా బాగా చూసుకున్నాను. తను కూడా నన్నెంతో గౌరవించేవారు. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు చాలా ఏడ్చాను. నా జీవితంలో నుంచి ఆయన వెళ్లిపోయాక చాలా కాలం ఒంటరిగా ఫీలయ్యాను. చాలా బాధపడ్డాను. ఒక్క రోజు, ఒక్క గంట నా భర్తతో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండని దేవుడిని కోరుకున్నాను. కనీసం కలలో అయినా కనపడితే మాట్లాడాలని ఆశించాను. ఎందుకంటే నేను అతడితో పంచుకావాల్సినవి, అడగాల్సినవి ఉన్నాయి. అయినా అతడు ప్రాణాలతో లేనప్పటికీ నా మాట వింటాడని భావించి ఎన్నో చెప్పుకున్నాను. అతడు చనిపోయాక నా కూతురు నాకు సపోర్ట్​గా నిలిచింది. నన్ను బయట ప్రపంచంలోకి మళ్లీ తీసుకెళ్లింది" అంటూ వెక్కి ఏడుస్తూ భావోద్వేగానికి గురైంది సురేఖ.

తన కూతురు సుప్రితతో పాటు తన డ్రెస్సింగ్​పై వచ్చే విమర్శలను పట్టించుకోనని చెప్పిన సురేఖ - రెండో పెళ్లి, రిలేషన్‌షిప్ లాంటి ఆలోచనలు కూడా ఏమీ లేవని మరోసారి క్లారిటీ ఇచ్చింది. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల వల్ల నెల రోజుల పాటు సరిగా తిండి కూడా తినలేదని, బాగా ఏడ్చినట్లు గుర్తుచేసుకుంది.

బంపర్​ ఆఫర్​ కొట్టేసిన మృణాల్​ ఠాకూర్! పాన్​ ఇండియా స్టార్​తో సినిమా?

వచ్చే ఏడాదే స్టార్ హీరోయిన్​తో టిల్లుగాడి పెళ్లి!- క్లారిటీ ఇచ్చిన చైతన్య జొన్నలగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.