తెలంగాణ

telangana

సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా - ఈ విషయాలు తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 4:21 PM IST

Secondhand Car Business: ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో మీరు యూజ్డ్ కార్ల బిజినెస్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? మంచి లాభాలు గడించవచ్చని అనుకుంటున్నారా? అయితే అంతకంటే ముందు మీరు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..

Second hand Cars
Second hand Cars

How to Open Secondhand Car Business:కొత్తదో పాతదో.. ఒక కారు ఉండాల్సిందే అని భావించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీంతో.. సెకండ్ హ్యాండ్ కార్ల(Secondhand Cars)కు గిరాకీ పెరుగుతోంది. ఆ మేరకు దేశంలో యూజ్డ్ కార్ల బిజినెస్ బాగా రన్ అవుతోందని.. ఆదాయం కూడా బాగా ఉంటోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి.. మీరు సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ ప్రారంభించాలని భావిస్తే.. ముందుగా కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకుని ఉండాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

రీసెర్చ్ :మీరు సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ ఓపెన్ చేసే మందు ఈ బిజినెస్ గురించి రీసెర్చ్ చేయండి. లాభాలు ఎలా ఉంటాయి? నష్టాలు ఎలా ఉంటాయి? ఎక్కడ తేడా కొట్టే ప్రమాదం ఉంటుంది? అనే విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఇందుకోసం ఇతర షోరూమ్​లను సంప్రదించండి. మార్కెట్ నిపుణులతో మాట్లాడండి. అనుభవం ఉన్నవారి సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకోవాలి. మార్కెట్​ రంగంపై సరైన పరిశోధన చేయకపోతే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Bank Seized Vehicles Auction : తక్కువ ధరకే.. సెకండ్ హ్యాండ్​ కార్లు.. ఇలా ఇంటికి తెచ్చుకోండి!

ప్లాన్ తయారు చేసుకోండి :మీ వ్యాపారాన్ని విజయవంతంగా నడపాలంటే.. ముందుగా దానికో ప్లాన్ ఉండాలి. మీ సెకండ్ హ్యాండ్ కారు షోరూమ్‌ ఎక్కడ తెరవాలనుకుంటున్నారనేది ప్రధానం. మంచి లొకేషన్ సెలక్ట్ చేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం మార్కెట్​లో ఎలా ఉంది? ఏడాది టర్నోవర్ ఎంత ఉంది? ఎన్ని కార్లు అమ్ముడు పోతున్నాయి? సెకండ్ హ్యాండ్ కార్లను మీరు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి? వినియోగదారులకు ఎలా టచ్​లో ఉండాలి? మార్కెటింగ్ ప్లాన్ ఏంటి? అనే వివరాలతో ఒక బ్లూప్రింట్​ సిద్ధం చేసుకోవాలి. అంతా ఓకే అనుకున్న తర్వాత.. ఆ ప్లాన్ ప్రకారమే ముందుకు సాగాలి.

పెట్టుబడి - ఖర్చులు :మీరు సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ ఓపెన్ చేసేముందు మీ వద్ద ఎంత డబ్బు ఉందనేది ముఖ్యం. కార్ల కోసం పెట్టుబడి ఎంత అవుతుంది? ఇతర ఖర్చుల కోసం ఎంత డబ్బు అవసరమవుతుంది? అనేది లెక్క వేసుకోవాలి. చేతిలో ఉన్న కొంత డబ్బుతో ముందు వ్యాపారం మొదలు పెట్టి.. ఆ తర్వాత చూసుకుందాం అనే పద్ధతిలో అడుగు వేయడం ఏ మాత్రం మంచిది కాదు. ఒకవేళ సరిపడా డబ్బు లేదంటే బ్యాంకు రుణం పొందే అవకాశం ఉంటుంది. దాన్ని పరిశీలించాలి. అది కూడా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకులను ఎంచుకోవాలి.

షోరూమ్ ప్రారంభ ఖర్చుల్లో కొన్ని..

  • షోరూమ్​ కోసం తీసుకున్న భవనం నెలవారీ అద్దె, అడ్వాన్స్
  • కంపెనీని స్థాపించడానికి కొన్ని చట్టపరమైన ఖర్చులు
  • ఫర్నిచర్, డెస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు వంటి ఇతర వస్తువులు
  • ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటికీ అవసరమైన మార్కెటింగ్, ప్రమోషన్ ఖర్చులు
  • వీటితోపాటు మరికొన్ని ఖర్చులు కూడా అదనంగా యాడ్ అవుతాయి.
  • బిజినెస్ ఓపెన్ చేయడానికి ముందే వీటన్నింటికీ కావాల్సిన డబ్బును సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాతనే స్టార్ట్ చేయడం మంచిదని వ్యాపార నిపుణులు సూచిస్తున్నారు.

సెకండ్ హ్యాండ్‌ కార్ల‌కు బ్యాంకు రుణాలు

కొత్తదైనా... పాతదైనా... కారు కారే కదా!

ABOUT THE AUTHOR

...view details