సెకండ్ హ్యాండ్‌ కార్ల‌కు బ్యాంకు రుణాలు

author img

By

Published : Sep 11, 2021, 2:59 PM IST

CAR LOANS

సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో.. వీటి కోసం వినియోగదారులకు పలు బ్యాంకులు రుణాలు (used car loan) అందిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఒప్పందాలు, వడ్డీ రేట్లు ఉండటం వల్ల.. ఉపయోగించిన కార్ల కొనుగోలు సులభంగా మారింది. మరి ఏ బ్యాంకు ఎలాంటి వడ్డీ రేట్లకు (used car loan interest rate) రుణాలు ఇస్తున్నాయి? ఈఎంఐ ఎంత చెల్లించాలి? ఓసారి తెలుసుకోండి...

ఉప‌యోగించిన‌ (సెకండ్ హ్యాండ్‌) కార్ల‌కు రుణాలు (used car loan) ఇవ్వ‌డానికి బ్యాంకులు ఆస‌క్తి చూపుతున్నాయి. భార‌త్‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు అధిక శాతంలో ఉన్నారు. అంద‌రూ డైర‌క్ట్‌గా కంపెనీ నుంచి షోరూమ్‌ల‌కు వ‌చ్చే కార్ల‌ను కొనేటంత‌ట స్థోమ‌త ఉండ‌కపోవ‌చ్చు. కానీ త‌గిన బ‌డ్జెట్‌లో త‌మ‌కు న‌చ్చిన కంపెనీ కారును (budget used cars) సొంతం చేసుకోవాల‌ని ఆశ మాత్రం ఉంటుంది. అలాగే స్వ‌ల్ప కాలానికి కారుని ఉప‌యోగించాల‌ని అనుకునే వారికి సెకండ్ హ్యాండ్‌కార్ల మార్కెట్లో కారు కొనుగోలు (second hand cars) మంచి అవ‌కాశ‌మ‌నే చెప్పాలి. ఇటువంటి కార్లు చౌక‌గా ల‌భిస్తాయ‌ని పేరు ఇప్ప‌టికే ఉంది. వినియోగ‌దారులు త‌మ బ‌డ్జెట్‌లో దొరికే కారులో షికారు చేయోచ్చు.

భార‌త్‌లో ఉప‌యోగించిన (సెకండ్ హ్యాండ్‌) కార్ల అమ్మ‌కాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిణామాల‌తో చాలామంది ప్ర‌జా ర‌వాణా కంటే ప్రైవేట్ ర‌వాణాను క‌లిగి ఉండ‌టానికి ఇష్ట‌ప‌డుతున్నారు. చాలా బ్యాంకులు ఆక‌ర్ష‌నీయ‌మైన ఒప్పందాలు, పోటీ వ‌డ్డీ రేట్ల‌ను (used car loan interest rate) అందిస్తుండ‌డంతో, ఉప‌యోగించిన కారు కొన‌డం సౌక‌ర్య‌వంతంగా, సుల‌భంగా మారింది. కారు కొన‌డం ఎప్పుడూ ఉత్సాహ‌క‌రంగా ఉంటుంది. చౌక‌గా ల‌భిస్తే ఇంకా ఆనందం మ‌రి. దీనికి కాస్త‌ ప‌రిశోధ‌నా, ప్ర‌ణాళిక చాలా అవ‌స‌రం. మీరు కారు కొనాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు, గ‌రిష్ట ఫీచ‌ర్ల‌తో టాప్‌-ఎండ్ మోడ‌ల్ కోసం చూడ‌డ‌మే కాకుండా మీ బ‌డ్జెట్‌కు (budget car finder) స‌రిపోయే కారును తీసుకోవాలి.

ఒక్కో బ్యాంకులో ఒక్కోలా...

ఉదాహ‌ర‌ణ‌కు, కొన్ని బ్యాంకులు 3 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న మోడ‌ల్ కార్ల‌కు మాత్ర‌మే రుణాలు ఇస్తారు. మ‌రికొంద‌రు 5 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న మోడ‌ల్ కార్ల‌కు రుణం ఇవ్వవ‌చ్చు. మీకు ఆమోదించిన రుణం, కారు విలువ‌లో 75% - 85% వ‌ర‌కు ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. ఉప‌యోగించిన కార్ల రుణానికి వ‌డ్డీ రేటు 11% - 16% మ‌ధ్య బ్యాంకులు వ‌సూలు చేస్తున్నాయి. తిరిగి రుణం చెల్లించే కాల వ్య‌వ‌ధి (car loan repayment period) కొన్ని బ్యాంకులు 7 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కూడా ఇస్తున్నాయి. ఇది కాకుండా మీరు కొంత మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. సాధార‌ణంగా ఉప‌యోగించిన కారు రుణాల వ‌డ్డీ రేట్లు కొత్త కారు రుణాల వ‌డ్డీ రేట్ల కంటే ఎక్కువ‌గా ఉంటాయి.

19 ప్ర‌ముఖ బ్యాంకులు అందించే 3 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధికి, రూ. 2.5 ల‌క్ష‌ల రుణానికి 'ఈఎమ్ఐ'లు క్రింది ప‌ట్టిక‌లో ఉన్నాయి.

USED CAR LOANS
వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

ఈ డేటా సెప్టెంబ‌ర్ 7, 2021 నాటిది.

ప్రాసెసింగ్ ఫీజు, మ‌రే ఇత‌ర ఛార్జీల‌ను ఈ 'ఈఎమ్ఐ' మొత్తంలో క‌ల‌ప‌లేదు. మీ రుణం ఆధారంగా మీకు వ‌ర్తించే వ‌డ్డీ రేటు ఎక్కువ‌గాను ఉండ‌వ‌చ్చు. మీ క్రెడిట్ స్కోర్‌ను బ‌ట్టి నిబంధ‌న‌లు ఉంటాయి.

*ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.