తెలంగాణ

telangana

FD కంటే అధిక వడ్డీ + ట్యాక్స్ బెనిఫిట్స్​ కావాలా? ఈ స్కీమ్​పై ఓ లుక్కేయండి! - National Savings Certificate Scheme

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 11:05 AM IST

National Savings Certificate Scheme : మీరు మంచి రాబడి ఇచ్చే పథకాల్లో పెట్టుబడి పెడదామని అనుకుంటున్నారా? పన్ను మినహాయింపులు కూడా లభించాలా? అయితే ఇది మీ కోసమే. ఇండియన్ పోస్ట్​ నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికెట్ స్కీమ్​ను అందిస్తోంది. దీనిపై ఎస్​బీఐ ఎఫ్​డీ కంటే అధిక వడ్డీ ఇస్తోంది. అంతే కాదు పన్ను మినహాయింపులు కూడా కల్పిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం.

Post Office Saving schemes
National Savings Certificate Scheme

National Savings Certificate Scheme :చాలా మందికి పెట్టుబడి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్లు. మంచి రాబడితోపాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయని వాటిలో పెట్టుబడి పెడుతుంటారు. అలాగే బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుందని భావిస్తారు. అలాంటి వారికి పోస్ట్ ఆఫీస్'నేషనల్​ సేవింగ్స్ సర్టిఫికెట్​'పథకం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ప్రభుత్వ స్కీంలో పెట్టుబడిపెడితే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, పన్ను మినహాయింపులు సహా బోలెడ్ ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా బ్యాంక్​ల్లో చేసే ఫిక్స్​డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ లభిస్తుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్బీఐ ఎఫ్​డీతో పోలిస్తే అధిక రాబడి :నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్​ 7.7% స్థిర వడ్డీ రేటును అందిస్తోంది. ఇది ఎస్​బీఐతో సహా అనేక ఇతర బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDలు) ఇచ్చే వడ్డీ రేటు కంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు ఎస్​బీఐ ప్రస్తుతం 5 సంవత్సరాల వ్యవధి గల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీని అందిస్తుంది. కానీ ఎన్​ఎస్​సీలో 7.7 శాతం వడ్డీ లభిస్తుంది.

రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు :సెక్షన్ 80సి కింద, ఎన్‌ఎస్‌సీలో పెట్టుబడి పెట్టిన డబ్బుపై సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

NSC Scheme Benefits :

కనీస పెట్టుబడి : మీరు కేవలం రూ.1000 కనీస మొత్తంతో ఈ స్కీంలో పెట్టుబడి పెట్టవచ్చు.

కాంపౌండ్ ఇంట్రెస్ట్​ : ఎన్​ఎస్​సీ స్కీమ్​ కాంపౌండ్​ ఇంట్రెస్ట్ అందిస్తుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడిపై ఏటా వడ్డీ వస్తుంది. ఇలా వచ్చిన వడ్డీ మళ్లీ ప్రిన్సిపల్ అమౌంట్​కు యాడ్ అవుతుంది. ఇలా ఐదేళ్ల టెన్యూర్​ వరకు కొనసాగుతుంది. ఈ చక్రవడ్డీ ప్రభావం వల్ల మీకు అధిక రాబడి వస్తుంది.

వడ్డీపై టీడీఎస్ లేదు : బ్యాంక్ ఫిక్స్​డ్ డిపాజిట్లపై టీడీఎస్ కట్ అవుతుంది. కానీ ఎన్​ఎస్​సీ స్కీమ్​లో, పెట్టుబడిపై సంపాదించిన వడ్డీపై టీడీఎస్​ కట్ కాదు.

దేశవ్యాప్తంగా : మీరు దేశవ్యాప్తంగా ఉన్న ఏ పోస్టాఫీసులో అయినా చాలా సులభంగా ఎన్ఎస్​సీ ఖాతాను తెరవవచ్చు. అయితే ఈ ఎన్​ఎస్​సీ స్కీమ్​కు 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. కనుక మీరు కావాలని అనుకున్నా, మధ్యలో (కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప) డబ్బులు వెనక్కు తీసుకోలేరు. ఈ విషయాన్ని ఇన్వెస్టర్లు కచ్చితంగా గుర్తించుకోవాలి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలతోపాటు, సురక్షితమైన పెట్టుబడిని కోరుకునే వ్యక్తులకు ఈ ఎన్​ఎస్​సీ స్కీం బెటర్ ఆప్షన్ అవుతుంది.

ఫ్లిప్​కార్డ్ సమ్మర్​ సేల్ - ఏసీలు, ఫ్యాన్లు​, రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్స్ & ఆఫర్స్​​! - Flipkart Summary Sale 2024

పాన్ కార్డ్ లేదా? కానీ CIBIL స్కోర్ చెక్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - Credit Score Without PAN Card

ABOUT THE AUTHOR

...view details