తెలంగాణ

telangana

పేటీఎంపై ఆర్​బీఐ ఆంక్షలు - మరి ఖాతాదారుల డబ్బు సేఫేనా? లోన్స్ పరిస్థితి ఏమిటి?

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 4:08 PM IST

Paytm Payments Bank RBI ban Can You Port Wallet FASTags : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎంపై భారీగా ఆంక్షలు విధించింది. వినియోగదారుల నుంచి ఫిబ్రవరి 29 తరువాత డిపాజిట్లు స్వీకరించకూడదని స్పష్టం చేసింది. ఇప్పుడు పేటీఎం ఖాతాదారుల పరిస్థితి ఏమిటి? వాళ్ల డబ్బులు సేఫేనా? పేటీఎం నుంచి తీసుకున్న లోన్స్ తిరిగి చెల్లించాలా? వద్దా?

paytm wallets and fastags
Paytm Payments Bank RBI ban

Paytm Payments Bank RBI ban Can You Port Wallet FASTags : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్​ (PPBL) ఫిబ్రవరి 29 తరువాత ఖాతాదారుల నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆర్​బీఐ ఆదేశించింది. అలాగా పేటీఎం అందించే పలు సేవలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పేటీఎం ఖాతాదారుల పరిస్థితి ఏమిటి? వాళ్ల డబ్బులు సురక్షితమేనా? పేటీఎం వాలెట్స్, ఫాస్టాగ్​ల్లోని డబ్బులు వాడుకోవచ్చా? మొదలైన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యూపీఐ పేమెంట్స్​
పేటీఎం యూజర్లు ఫిబ్రవరి 29 వరకు యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. కనుక వారిపై తక్షణ ప్రభావం ఏమీ ఉండదు. కానీ ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుపడదు. కనుక ఇప్పటి నుంచే మరో ప్రత్యామ్నాయం ఎంచుకోవడం మంచిది. ఒకవేళ మీ యూపీఐ ఐడీ - ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​ లాంటి ఇతర బ్యాంకులతో లింక్ అయ్యుంటే మీకు ఎలాంటి సమస్య ఏర్పడదు. కనుక నేరుగా ఎప్పటిలానే యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు.

పేటీఎం వాలెట్ సంగతేంటి?
పేటీఎం వాలెట్ అనేది పూర్తిగా పీపీబీఎల్​పై ఆధారపడి ఉంటుంది. పైగా ఫిబ్రవరి 29 వరకు మాత్రమే మీరు పేటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయగలుగుతారు. ఆ తరువాత కుదరదు. ఒకవేళ మీకు డబ్బులు అవసరమైతే ఇప్పటివరకు పేటీఎంలో ఉన్న డబ్బులు మాత్రమే విత్​డ్రా చేసుకోవడానికి వీలవుతుంది. ఖాతాదారులు కోరుకుంటే వారి పేటీఎం వాలెట్​లోని డబ్బును ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా ఇతర బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు.

సబ్​-వాలెట్ల పరిస్థితి ఏమిటి?
ఫిబ్రవరి 29 తరువాత ఖాతాదారులు పేటీఎం ద్వారా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, టాప్​-అప్​లు చేయలేరు. అలాగే ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్టాగ్​ ఉపయోగించలేరు. మెట్రోల్లో ఉపయోగించే నేషనల్​ కామన్​ మొబిలిటీ కార్డులు (NCMC), ఫుడ్​, ఫ్యూయెల్ కార్డులు కూడా వాడలేరు. అయితే పేటీఎం యూజర్లు తమ ఖాతాల్లోని నిధులను ఫిబ్రవరి 29 వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వాడుకోవచ్చు.

ఫాస్టాగ్ పని చేస్తుందా?
ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ఫాస్టాగ్​లు పనిచేయవు. కనుక పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు వీలైనంత త్వరగా ఇతర ఫాస్టాగ్​లను కొనుగోలు చేసుకోవడం మంచిది. వాస్తవానికి దేశంలో ఫాస్టాగ్​లు జారీ చేస్తున్న అతిపెద్ద సంస్థల్లో పేటీఎం మూడో స్థానంలో ఉంది. గత ఏడాది పేటీఎం ఏకంగా 58 మిలియన్ల ఫాస్టాగ్​ ట్రాన్సాక్షన్లను ప్రాసెస్ చేసింది. కానీ ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ఫాస్టాగ్ పనిచేయదు. కనుక యూజర్లపై చాలా ప్రభావం పడనుంది.

స్టాక్​ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ సేవల సంగతేంటి?
స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ సర్వీసులు సెబీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఆర్​బీఐ ఆర్డర్స్ వీటిపై ప్రభావం చూపవు. కనుక పేటీఎం అందిస్తున్న స్టాక్ మార్కెట్, మ్యూచువల్​ ఫండ్​ సర్వీసులపై నేరుగా ప్రభావం పడకపోవచ్చు!

లోన్స్ పరిస్థితి ఏమిటి?
పేటీఎం అందించే లోన్స్​పై ఎలాంటి ప్రభావం పడదు. పేటీఎం మంజూరు చేసిన రుణాలను థర్డ్ పార్టీ లెండర్లు వసూలు చేస్తారు. కనుక పేటీఎం ద్వారా లోన్స్ తీసుకున్న రుణగ్రహీతలు వాటిని కచ్చితంగా తిరిగి కట్టాల్సి ఉంటుంది.

పేటీఎం షేర్లు 20% పతనం
ఆర్​బీఐ ఆంక్షలు విధించడంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ మాతృసంస్థ వన్​91 కమ్యునికేషన్ షేర్స్​ 20 శాతం మేర పతనం అయ్యాయి. దీనితో స్టాక్ వాల్యూ ఏకంగా రూ.608.80కు పడిపోయింది.

లాభాలపై ప్రభావం
ఆర్​బీఐ ఆంక్షలు విధించడంతో పేటీఎం లాభాలపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ముఖ్యంగా వార్షిక లాభాలు (ఆపరేషనల్ ప్రాఫిట్స్​) రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు తగ్గవచ్చని అంచనా.

ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్తున్నారా? ట్రావెల్​ ఇన్సూరెన్స్ మస్ట్​ - బెనిఫిట్స్ ఏమిటంటే?​

అంగన్వాడీలు, ఆశావర్కర్లకు ఆయుష్మాన్ భారత్ కార్డులు - గృహ రుణాలు!

ABOUT THE AUTHOR

...view details