తెలంగాణ

telangana

సమ్మర్​లో వెకేషన్​ ప్లాన్​ చేస్తున్నారా? ఈ ప్లేసెస్​కు వెళ్తే ఫుల్​ ఎంజాయ్​! - Tourist Places in india for summer

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 12:30 PM IST

Tourist Places in India
Tourist Places in India

Tourist Places in India : వేసవిలో స్కూల్స్​కు హాలిడేస్​ ఉండటంతో పిల్లలతో కలిసి చాలా మంది టూర్స్​ వెళ్లడానికి రెడీ అవుతారు. హాట్​ సమ్మర్​లో కూల్​ కూల్​ ప్లేసెస్​కు వెళ్లి ఫుల్​గా ఎంజాయ్​ చేయాలనుకుంటారు. మరి మీరు కూడా ఇలానే ప్లాన్​ చేస్తున్నారా? అయితే, మీ కోసమే ఈ స్టోరీ. సమ్మర్‌లో ఎక్కువ మంది వెళ్లే బెస్ట్​ టూరిస్ట్​ ప్లేసెస్​ లిస్ట్​ పట్టుకొచ్చాం. మరి లేట్​ చేయకుండా ఈ స్టోరీ చదివేయండి..

Best Tourist Places for Summer in India :సమ్మర్​ హాలీడేస్​ వచ్చేశాయి. సంవత్సరం అంతా పుస్తకాలకు అతుక్కుపోయిన పిల్లలు ఫ్రీ బర్డ్స్‌ అయిపోయారు. ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి వెకేషన్​కు వెళ్లడానికి చాలా మంది సిద్ధం అవుతారు. మరి మీరు కూడా ఈ సమ్మర్‌ హాలీడేస్‌లో ఎక్కడికైనా ట్రిప్‌కు వెళ్లాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఇది. ఎక్కడికి వెళ్లాలి ? ఏ టూరిస్ట్‌ ప్లేస్​ చూడాలి అనే టెన్షన్​ వదిలేయండి. ఎందుకంటే సమ్మర్‌లో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లే కొన్ని ప్రదేశాల జాబితాను మీకోసం తీసుకొచ్చాం. అయితే ఆ ప్లేస్​లు ఎక్కడో కాదండి.. మన ఇండియాలోనే. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

మనాలి, హిమాచల్ ప్రదేశ్ :సమ్మర్‌లో ఎక్కువ మంది వెళ్లే పర్యాటక ప్రదేశాలలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుంది. ఇక్కడ మంచుతో కప్పేసిన పర్వతాలు, దట్టమైన లోయలు, నదులు పర్యాటకులను కట్టిపడేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడికి వెళ్లినవారు అత్యంత పురాతనమైన హిడింబా దేవాలయం, 3900 మీటర్ల ఎత్తులో ఉన్న రోహతాంగ్‌ పాస్​ కచ్చితంగా చూడాలి. అలాగే పారాగ్లైడింగ్‌, జిప్‌లైనింగ్‌ వంటి సాహస క్రీడలలో పాల్గొనాలనుకునేవారు సోలాంగ్‌ వ్యాలీని సందర్శించవచ్చు. ఇంకా ఇక్కడి లోకల్‌ మార్కెట్లో షాపింగ్‌ చేస్తూ మీ ట్రిప్‌ను ఎంతో ఎంజాయ్‌ చేయవచ్చు.

డార్జిలింగ్‌, వెస్ట్‌ బెంగాల్‌ :అందమైన పర్యాటక ప్రదేశాలలో వెస్ట్‌ బంగాల్‌లోని డార్జిలింగ్‌ ఒకటి. ఇక్కడ అందమైన కొండల మధ్యలో ఉండే టీ తోటలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. సమ్మర్‌లో మీరు ఇక్కడికి వెళ్తే పచ్చని తేయాకు తోటల మధ్యలో టీ తాగుతూ ఎంజాయ్‌ చేయవచ్చు. అలాగే డార్జిలింగ్‌లోని టైగర్‌ హిల్‌ ప్రాంతంలోసూర్యోదయాన్ని చూడటానికి చాలా మంది పర్యాటకులు వెళ్తారు. అలాగే అత్యంత పురాతనమైన గుమ్‌ మోనస్టరీ బౌద్ధ మఠాన్ని కూడా సందర్శించవచ్చు. మీరు ఇక్కడికి వెళ్తే డార్జిలింగ్‌ నుంచి ఘుమ్‌ వరకు వెళ్లే చిన్న రైలులో తప్పకుండా ప్రయాణం చేయండి. ఈ జర్నీని మీరు జీవితంలో మర్చిపోలేరు. అంత బాగుంటుంది.

గాంగ్‌టక్‌, సిక్కిం :సిక్కిం రాజధాని గాంగ్‌టక్‌ నగరం. ఇక్కడ మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, అందమైన కొండల మధ్యలో నుంచి జాలువారుతున్న సెలయేళ్లు పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. అలాగే ఇక్కడి పురాతనమైన బౌద్ధ మఠాలు మనల్ని అధ్యాత్మిక భావనలోకి తీసుకెళ్తాయి. ఇక్కడికి మీరు వెళ్తే హనుమాన్‌ టోక్‌కి ట్రెక్కింగ్‌కు తప్పకుండా వెళ్లండి. ఎందుకంటే ఇక్కడి నుంచి కాంచన్‌జంగా పర్వతం అందాల్ని చూడవచ్చు. అలాగే లోకల్ మార్కెట్లో షాపింగ్‌ చేస్తూ, సంప్రదాయ సిక్కిం వంటకాలనుఆస్వాదించవచ్చు.

మున్నార్‌, కేరళ :మున్నార్‌ అనేది కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న ఒక అందమైన పట్టణం. ఇక్కడ ఎటుచూసిన విశాలమైన తేయాకు తోటలు, పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మున్నార్‌కు వెళ్తే ఎరవికులం నేషనల్‌ పార్క్‌ను తప్పకుండా సందర్శించండి. ఇందులో నీలకరింజీ, ఆసియాటిక్‌ ఏనుగులతో పాటు అంతరించిపోతున్న వివిధ రకాల వన్యప్రాణులను చూడవచ్చు. అలాగే ట్రెక్కింగ్‌, బోటింగ్‌ చేయాలనుకునే వారు మట్టుపెట్టి డ్యామ్‌ను సందర్శించండి. ఇంకా సీతాకుండం వద్ద కూడా ట్రెక్కింగ్, క్యాంపింగ్‌ చేసుకోవచ్చు.

లేహ్‌, లద్దాఖ్‌ :లేహ్‌లో ఎత్తైన మంచు పర్వతాలు, మధ్యలో అక్కడక్కడా ఉండే గ్రామాలు.. అందమైన సరస్సులు కొలువుదీరిన ప్రాంతాలు పర్యాటకులను చూపు తిప్పుకోనివ్వవు. 17వ శతాబ్దంలో నిర్మించిన లద్దాఖ్‌ రాజుల నివాస భవనం లేహ్‌ ప్యాలెస్‌ ఇక్కడ పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. అలాగే ట్రెక్కింగ్‌ చేయాలనుకునే వారికి లేహ్‌ ఒక స్వర్గధామంగా చెబుతారు. ఎందుకంటే ఇక్కడ నుబ్రా వ్యాలీ, ట్రాన్స్‌ జిమ్‌క్వాల్‌ ట్రెక్, చాంగ్‌త ట్రెక్ వంటి వివిధ ప్రాంతాలలో ట్రెక్కింగ్‌ చేయవచ్చు. ఇంకా మీరు ఇక్కడికి వెళ్తే మ్యాగ్నెటిక్‌ హిల్స్, పాంగాంగ్‌ సరస్సును కూడా చూడవచ్చు.

మెక్‌లియోడ్‌ గంజ్‌, హిమాచల్ ప్రదేశ్ :హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా వ్యాలీ జిల్లాలో మెక్‌లియోడ్ గంజ్ పట్టణం ఉంటుంది. ఇది టిబెటియన్‌ వలసరాజులకు నిలయంగా చెబుతారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలలో దలైలామా ఆలయం, టిబెట్‌ మ్యూజియం ఉన్నాయి. దలైలామా ఆలయాన్ని సందర్శిస్తే బౌద్ధ మత ఆచారాలు, విశ్వాసాలు, చరిత్ర వంటి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే టిబెట్‌ ప్రజల సంస్కృతి గురించి తెలుసుకోవడానికి టిబెట్‌ మ్యూజియాన్ని కూడా చూడవచ్చు. ఇంకా మెక్‌లియోడ్‌ గంజ్‌ చుట్టు పక్కల అనేక ట్రెక్కింగ్‌ ట్రయల్స్‌ ఉన్నాయి.

చూశారుగా.. సమ్మర్‌లో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లే టూరిస్ట్‌ ప్లేసెస్‌ ఇవి. నచ్చితే మీరు కూడా మీ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఒక ట్రిప్‌కు వెళ్లండి.

హైదరాబాద్​ To తిరుపతి - IRCTC స్పెషల్​ ప్యాకేజీ- శ్రీవారి స్పెషల్​ దర్శనంతో పాటు మరెన్నో! - IRCTC Poorva Sandhya Tour Packages

రామోజీ ఫిల్మ్‌సిటీలో సమ్మర్ స్పెషల్ హాలిడే కార్నివాల్‌ - ఇక సందడే సందడి - Ramoji Film City Holiday Carnival

ABOUT THE AUTHOR

...view details