తెలంగాణ

telangana

అలర్ట్ : మీ పిల్లలు ఆన్​లైన్​కు బానిసవుతున్నారా? - ఈ టిప్స్​తో మీ దారిలోకి తెచ్చుకోండి!

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 2:05 PM IST

Tips to Protect Children From Online : ఇంటర్నెట్​.. దీని గురించి పరిచయం అక్కర్లేదు. పసి హృదయాల నుంచి పండు ముసలి వరకు ఇప్పుడు మాగ్జిమమ్ అందులోనే ఉంటున్నారు. ఆడుకోవాల్సిన వయసు పిల్లలు.. ఫోన్​ చేతబట్టి ఇంటర్నెట్​తో కాలక్షేపం చేస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా ఏ చేయలేకపోతున్నారా..? మరి మీరు కూడా ఈ పరిస్థితుల్లోనే ఉన్నారా..? అయితే నిపుణులు సూచిస్తున్న ఈ టిప్స్ పాటించండి!

Tips to Protect Your Children from Online
Tips to Protect Your Children from Online

Tips to Protect Your Children from Online :చిన్నారులపై ఇంటర్నెట్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. రెండేళ్లకే పసి హృదయాలను స్మార్ట్ ఫోన్లు ప్రభావితం చేస్తున్నాయి. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఫోన్ల చుట్టూ పిల్లలు మూగుతున్నారు. చదువులు కంటే ఇంటర్నెట్ పైనే ఎక్కువగా ఆసక్తి పెంచుకుంటున్నారు. చివరకు ఈ ఫోన్​ గేమ్స్​కు అలవాటై మానసిక రోగులుగా మారుతున్నారు. ఈ పరిస్థితి నుంచి పిల్లలు బయటపడడానికి నిపుణులు సలహాలు ఇస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

బెడ్​రూమ్​లో నో ఫోన్ :పిల్లలు ఫోన్​ చూసే విషయంలో ఓ నియమం పెట్టండి. కేవలం హాల్​లో మాత్రమే ఫోన్​ వాడే విధంగా కండీషన్​ పెట్టండి. బెడ్​రూమ్​లో​ ఫోన్​ వాడొద్దని చెప్పండి. ముఖ్యంగా పెద్దలు కూడా బెడ్​రూమ్​లో ఫోన్​ వాడకుండా చూసుకోండి. పెద్దల్ని చూసే పిల్లలు నేర్చుకునేది కాబట్టి మీరు కూడా పడుకునే టైంలో ఫోన్ వాడటాన్ని బంద్​ చేయాలి.

అలర్ట్ - మీ పిల్లలకు ఈ అలవాట్లు ఉన్నాయా?

ఇంటర్నెట్​ సేఫ్టీ:చాలా మంది పిల్లలకు ఇంటర్నెట్​ను ఎలా వాడాలో తెలుసుగానీ.. వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియదు. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. ఇంటర్నెట్​ భద్రత గురించి వాళ్లకు వివరంగా చెప్పాలి. ఆన్​లైన్​ వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల గురించి ఎటువంటి దాపరికాలు లేకుండా ఓపెన్​గా కమ్యూనికేట్​ అవ్వండి.

ఆన్​లైన్​ ఫ్రెండ్స్​ గురించి తెలుసుకోండి:మీ పిల్లలు ఆన్​లైన్​లో ఎవరితో గేమ్స్​ ఆడుతున్నారు? ఎవరితో చాట్​ చేస్తున్నారో తెలుసుకోవాలి. అలాగే వారిమధ్య జరిగే సంభాషణను ట్రాక్​ చేయాలి. ఒకవేళ ఏదైనా తప్పు దారిలో వెళ్తున్నట్లైతే తెలియజెప్పాలి.

టీనేజ్​లో పిల్లలు మిమ్మల్ని కోపగించుకుంటున్నారా? - అయితే పేరెంట్స్ చేసే ఈ పొరపాట్లే కారణం!

షేర్ చేయడం గురించి :ఆన్​లైన్​లో షేర్ చేసే ఇన్ఫర్మేషన్​కి సంబంధించి పిల్లలకు అవగాహన కల్పించాలి. ఎటువంటి ఇన్ఫర్మేషన్​ను ఆన్​లైన్​లో షేర్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోకూడదు అన్న విషయాల గురించి మీ చిన్నారులకు చెప్పండి. ఆన్లైన్​లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిది కాదని చెప్పండి. చాలా సోషల్ మీడియా వెబ్​సైట్స్​ హ్యాకింగ్​కు పాల్పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇవి చిన్నపిల్లలను టార్గెట్ చేస్తాయి. కాబట్టి, అడ్రస్, స్కూల్ పేరు వంటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ను ఆన్లైన్​లో షేర్ చేయకూడదని చిన్నారులకు చెప్పండి. వారేదైనా ఆన్​లైన్​లో పోస్ట్ చేసే ముందు మీ పర్మిషన్​ తీసుకోవాలని ముందుగా చెప్పండి. ఒకవేళ ఏదైనా పోస్ట్ చేసినా వెంటనే మీతో షేర్ చేసుకోవాలని చెప్పండి.

బ్రౌజింగ్ టైమ్​ను ట్రాక్​ చేయండి:మీ చిన్నారుల సేఫ్టీ కోసం మీరు ఇంప్లిమెంట్​ చేయాల్సిన విషయం ఏంటంటే.. మీ చిన్నారులు ఎంత సేపు ఆన్​లైన్​లో గడుపుతున్నారు. సోషల్ మీడియా పిల్లలు, ముఖ్యంగా బాలికల శారీరక, మానసిక శ్రేయస్సుపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది. మీ పిల్లలు ఆన్‌లైన్‌లో ఎంత సమయం గడుపుతున్నారో ట్రాక్ చేయడాన్ని పేరెంట్స్​ అలవాటు చేసుకోవాలి. ఆపై వారి గంటలను తదనుగుణంగా తగ్గించాలి.

మీ పిల్లల వ్యక్తిత్వం బాగుండాలా? అయితే మీరు​ ఈ పనులు ఆపేయండి!

సామాజిక అవగాహన నేర్పండి:మీ పిల్లలు సోషల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తుంటే.. అభ్యంతరకరమైన పోస్ట్‌లను నివేదించడం, వ్యక్తులను బ్లాక్ చేయడం ఎలాగో వారికి నేర్పించడం ముఖ్యం. మీరు వారిని ఆన్‌లైన్‌లో అనుమతించే ముందు.. ప్రతి సామాజిక ప్లాట్‌ఫారమ్ దేనికి ఉపయోగిస్తారో పరిశోధన చేయండి.

యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను సెటప్ చేయండి:సైబర్​ మాల్వేర్, వైరస్ ప్రమాదాల నుంచి మీ పిల్లలను రక్షించడానికి వారి పరికరాలలో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

మీ పిల్లలు సురక్షిత సైట్‌లలో ఉండేలా చూసుకోండి:వెబ్‌సైట్ సురక్షితంగా ఉందంటే.. సందర్శకుల సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి దానికి భద్రతా ప్రమాణపత్రం ఉందని అర్థం. అడ్రస్ బార్‌ని చూడటం ద్వారా వారు ఉపయోగిస్తున్న సైట్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మీరు మీ పిల్లలకు శిక్షణ ఇవ్వవచ్చు. సురక్షిత సైట్‌లు "http" చివరన "s"ని కలిగి ఉంటాయి. కొన్నిసార్లు లాక్​ కూడా కనిపిస్తుంది.

మీ పిల్లలు నిత్యం నవ్వుతూ ఉండాలా? - అయితే ఈ 5 విషయాలు చెప్పండి!

పాస్​వర్డ్స్​ను షేర్ చేయకూడదని చెప్పండి:పిల్లల్లో సహజంగా తమకు సంబంధించిన సమాచారాన్ని ఫ్రెండ్స్​తో షేర్ చేసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. తమ స్నేహితులతో వారు పాస్వర్డ్స్​ను ఇంకా ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వలన ఎన్నో ఇబ్బందులు వస్తాయని చెప్పండి. ఆన్​లైన్​లో ఇలా పర్సనల్ ఇన్ఫర్మేషన్​ను షేర్ చేయడం రిస్క్ అని చెబుతూ.. సైబర్ బుల్లీయింగ్ అలాగే ట్రోలింగ్స్​ను కూడా ఫేస్ చేయవలసి వస్తుందని చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పండి. పిల్లలు ఆన్​లైన్​లో యాక్సెస్ చేసే వాటికి తల్లిదండ్రులు 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్​ను సెట్ చేయాలి.

మీ పిల్లలు క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటే చూడాలనుందా? - తల్లిదండ్రులుగా మీరు ఇవి చేయాలి!

పిల్లలు స్కూల్​ నుంచి వచ్చాక పేరెంట్స్​ అడగాల్సిన ప్రశ్నలివే! ఎందుకో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details