తెలంగాణ

telangana

పక్షులకు వడదెబ్బ- ఈ ​ఆస్పత్రిలో స్పెషల్​ ట్రీట్​మెంట్​తో బిగ్​ రిలీఫ్​! - Special Hospital For Birds

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 5:58 PM IST

Special Hospital For Birds In Delhi : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన వేడి గాలులకు మనుషులే కాదు వన్యప్రాణులూ తల్లడిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వ్యాధుల బారిన పడుతున్న పక్షుల కోసం ఓ ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేశారు. వడదెబ్బ తగిలి బాధపుడుతున్న పక్షులు ప్రత్యేక వసతులు కల్పించి చికిత్స అందిస్తున్నారు. మరి అలాంటి పక్షుల ఆస్పత్రి ఎక్కడ ఉంది? దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Special Hospital For Birds In Delhi
Special Hospital For Birds In Delhi

హీట్​వేవ్​తో పక్షులకు వడదెబ్బ- ఈ ​ఆస్పత్రిలో స్పెషల్​ ట్రీట్​మెంట్​తో బిగ్​ రిలీఫ్​!

Special Hospital For Birds In Delhi :పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మనుషులే కాదు పక్షులు కూడా తట్టుకోలేకపోతున్నాయి. తాగడానికి నీరు లభించక, వేడి గాలుల కారణంగా వడదెబ్బకు గురవుతున్నాయి. ఇలాంటి పక్షుల కోసం ఓ ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.

ఛారిటీ బర్డ్స్​ హాస్పిటల్​

వేడి గాలుల తీవ్రతకు ఇబ్బందిపడుతున్న పక్షుల సంరక్షణకు, దిల్లీలోని చాందినీ చౌక్​లో ఉన్న ఛారిటీ బర్డ్స్​ హాస్పిటల్​ నడుం కట్టింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వ్యాధుల బారిన పడి ఆస్పత్రికి వచ్చిన పక్షులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పక్షుల కేసులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు వైద్యులు.

పక్షిని పరీలిస్తున్న వెటర్నరీ వైద్యులు

"నేను హరావతార్​ సింగ్​. ఇక్కడ సీనియర్​ వెటర్నరీ డాక్టర్​​గా పనిచేస్తున్నాను. దిల్లీలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల మా వద్దకు పక్షుల కేసులు రావడం ప్రారంభమైంది. ఎండలు పెరుగుతున్నకొద్దీ పక్షులు వడదెబ్బ బారిన పడుతున్నాయి. తద్వారా వాటికి వ్యాధుల వస్తున్నాయి. ఈ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. మా ఆస్పత్రికి వచ్చిన కొన్ని పక్షులు వడ దెబ్బకు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి."
-- హరావతార్​ సింగ్, సీనియర్ డాక్టర్

ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో సగటున ప్రతిరోజు 5 నుంచి 15 పక్షులు తమ ఆస్పత్రికి వస్తాయని డాక్టర్​ హరావతార్ సింగ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరగవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం తమ బర్డ్స్​ హాస్పిటల్​లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న 30 నుంచి 40 పక్షులు ఉన్నాయని తెలిపారు డాక్టర్.

ఛారిటీ బర్డ్స్​ హాస్పిటల్​

"వడదెబ్బతో మా ఆస్పత్రికి వచ్చిన పక్షులపై మొదటగా నీళ్లను స్ప్రింకిల్​ చేస్తాము. దాంతో పాటు ఎగ్జాస్ట్​ ఫ్యాన్లతో సరైన వెంటిలేషన్​ కల్పిస్తాము. అంతేకాకుండా ఆస్పత్రిలో ఉన్న పెద్ద ఫ్యాన్లతో చల్లని గాలి ఇస్తాము. తద్వారా పక్షుల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది."
-- హరావతార్​ సింగ్, సీనియర్ డాక్టర్

పక్షుల శరీర ఉష్ణోగ్రత సహజంగానే 107 డిగ్రీల ఫారన్​హీట్​ ఉంటందన్న హరావతార్​ టెంపరేచర్​ 110 డిగ్రీల ఫారన్​హీట్​ దాటితే పక్షుల ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు. అప్పుడు పక్షులు బతకడానికి వాటికి తక్షణ సహాయం, ఇంటెన్సివ్ కేర్ అవసరమవుతుందని తెలిపారు.

'ఎమ్మెల్యేలు, ఎంపీల 'నేరాల'పై స్పెషల్ ఫోకస్- గతేడాది 2వేలకుపైగా కేసులు పరిష్కారం' - SC On MP And MLA Criminal Cases

దిల్లీ డంపింగ్​ యార్డ్​లో చల్లారని మంటలు- దుర్వాసన, పొగతో స్థానికుల తీవ్ర అవస్థలు - Ghazipur Landfill Fire

ABOUT THE AUTHOR

...view details