తెలంగాణ

telangana

ఇక దేశంలో ఉల్లి కొరత ఉండదు! అన్ని సీజన్లలో సాగు చేసేలా 93కొత్త వంగడాల ఆవిష్కరణ - 93 varieties of onion

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 11:01 AM IST

Updated : Apr 15, 2024, 11:27 AM IST

New Varieties Of Onion Seeds : దేశంలో ఉల్లి సాగును పెంచేందుకు 93 రకాల కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. దీంతో దేశంలో ఏటా ఏర్పడే ఉల్లిపాయల కొరతను అధిగమించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ కొత్త వంగడాలను అన్ని సీజన్లలో సాగు చేయవచ్చని, వివిధ తెగుళ్లు నుంచి వీటికి రక్షణ ఉంటుందని తెలిపారు.

93 New Species Of Onion Seeds Developed In UP Kanpur
93 New Species Of Onion Seeds Developed In UP Kanpur

New Varieties Of Onion Seeds : ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లోని చంద్రశేఖర్​ ఆజాద్​ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 93 రకాల కొత్త ఉల్లి వంగడాలను అభివృద్ధి చేశారు. వీటితో దేశంలో ప్రతి సంవత్సరం ఏర్పడే ఉల్లిపాయల కొరతను అధిగమించవచ్చని చెబుతున్నారు. వీటిలో ఎరుపుతో పాటు తెలుపు రంగు ఉల్లిపాయలకు చెందిన వివిధ రకాల జాతి విత్తనాలు కూడా ఉన్నాయి. ఈ విత్తనాలను దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అందించనున్నామని, తద్వారా రైతులు రెండు సీజన్ల(రబీ, ఖరీఫ్​)లోనూ ఉల్లి సాగుచేసే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిరంతర సాగుతో దేశంలో ఉల్లి కొరత అనే సమస్యను కొంతైనా అధిగమించవచ్చని అంటున్నారు.

వాస్తవానికి ఉత్తర్​ప్రదేశ్​లో ఉల్లిసాగు చాలా తక్కువగా జరుగుతుందని, దానిని దృష్టిలో ఉంచుకొనే కొత్త ఉల్లి రకాలను ఉత్పత్తి చేశామని చెప్పారు సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రామ్‌ బతుక్‌ సింగ్‌. 'మహారాష్ట్ర, గుజరాత్​, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఖరీఫ్‌ సీజన్​లో అధికంగా ఉల్లిని సాగు చేస్తారు. కానీ యూపీలో మాత్రం ఆశించిన స్థాయిలో పండించడం లేదు. ఈ కారణంగానే ప్రతి సంవత్సరం అక్టోబర్​-నవంబర్​ సమయంలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. అయితే యూపీ ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటుంది' అని రామ్‌ బతుక్‌ చెప్పారు.

ఈ 93 రకాల ఉల్లి విత్తనాలను అభివృద్ధి చేసేందుకు రబీ సీజన్​ అయిన ఫిబ్రవరి-మార్చిలో శాస్త్రవేత్తలు విత్తనాలను నాటారు. కేవలం 25 రోజుల్లోనే దీనికి సంబంధించిన నర్సరీ సిద్ధం అయింది. దీని ప్రకారం అక్టోబర్-నవంబర్​, ఫిబ్రవరి-మార్చి రెండు సీజన్లలోనూ రైతులు ఉల్లిపాయలను పండించే అవకాశం ఉంటుంది. కాగా, కొత్తగా తయారు చేసిన విత్తనాల రకాలు ప్రతి సీజన్‌కు అనుకూలంగా ఉంటాయి. అంతేగాక తెగుళ్లు, వ్యాధులకు దూరంగా ఉంటాయి. ఇదిలాఉంటే భారత్​లో ప్రతి సంవత్సరం 26,738 మెట్రిక్​ టన్నుల ఉల్లి ఉత్పత్తి జరుగుతుంది. ఉత్తర్​ప్రదేశ్​లో నెలకు 2.1 లక్షల టన్నులు ఉల్లిని వినియోగిస్తున్నారు. ఈ లెక్కన తలసరి ఉల్లి వినియోగం 20 కిలోలు(సంవత్సరానికి)గా ఉంది.

కిలో విత్తనాల ధర ఎంతంటే
ఈ కొత్త ఉల్లి వంగడాలను రైతులు డైరెక్టరేట్​ ఆఫ్​ ఆనియన్​ అండ్​ గార్లిక్​ రీసెర్చ్ వెబ్‌సైట్‌లో ఆన్​లైన్​లో కొనుగోలు చేయవచ్చని శాస్త్రవేత్త డాక్టర్​ రామ్​ బతుక్​ సింగ్​ చెప్పారు. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫారమ్‌ను నింపి వీటిని పొందవచ్చని తెలిపారు. ఆన్​లైన్​లో చెల్లింపు చేసిన తర్వాత విత్తనాలను సంబంధిత రైతుల చిరునామాకు పంపిస్తామని వెల్లడించారు. కాగా, ఉల్లి విత్తనాల ధర ప్రస్తుతం కిలోకు రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ఉంది.

"ఖరీఫ్​ సీజన్​లో పండే ఉల్లి రంగు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. దానిపై తొక్క తడిగా ఉంటుంది. అయితే రబీలో పండే ఉల్లి మాత్రం పొడిగా అంటే ఎండిపోయి ఉంటుంది. దీంట్లో దుమ్ము ఎక్కువగా ఉండదు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఇప్పట్నుంచి రబీ సీజన్​లోనూ ఉల్లిని సాగు చేయవచ్చు."
- డాక్టర్​ రామ్​ బతుక్​ సింగ్​, చంద్రశేఖర్​ ఆజాద్​ యూనివర్సిటీ శాస్త్రవేత్త

కుప్పకూలిన రెండంతస్తుల భవనం- శిథిలాల కింద 25మంది- టెన్షన్ టెన్షన్​! - Building Collapse In Uttar Pradesh

ఈ స్మార్ట్​వాచ్​తో ఫుల్​ బాడీ రిపోర్ట్!- డాక్టర్​కు, ఫ్యామిలీకి మెసేజ్​- ధర తక్కువే! - health monitoring watch for seniors

Last Updated : Apr 15, 2024, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details