తెలంగాణ

telangana

సండే స్పెషల్ - మధురై కుందు భాయ్‌ స్టైల్‌ బిర్యానీ ట్రై చేయండి!

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 5:25 PM IST

Madurais Kundu Bhai Style Biryani Recipe : బిర్యానీ అంటే హైదరాబాదీ ధమ్ బిర్యానేయే! మన బిర్యానీ వరల్డ్ ఫేమస్!! అయితే.. ప్రతిసారీ ఇదే కాకుండా ఇతర రెసిపీలను కూడా టేస్ట్ చేస్తే బాగుంటుంది. సో.. మీరు కూడా ఇలా కొత్త రెసిపీలను టేస్ట్ చేసే వారైతే.. మీకోసమే "మధురై కుందు భాయ్‌ స్టైల్‌" బిర్యానీ తీసుకొచ్చాం. మరి.. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Madurais Kundu Bhai Style Biryani Recipe
Madurais Kundu Bhai Style Biryani Recipe

Madurai Kundu Bhai Style Biryani Recipe :నాన్ వెజ్ రెసిపీస్​ టాపిక్​లోహైదరాబాద్‌ అనగానే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది.. 'హెదరాబాద్‌ చికెన్‌ దమ్‌ బిర్యానీ'. ఒక్కసారి ఈ బిర్యానీ రుచి చూశారంటే అంతే.. మసాలా నషాళానికి అంటాల్సిందే. టేస్ట్.. అంత బాగుంటుంది మరి. అయితే.. ఈ రుచి మనం ప్రతిసారీ ఆస్వాదిస్తుంటాం. అందుకే.. ఈ సండే ఓ కొత్త బిర్యానీ టేస్ట్ చేద్దాం. అదే.. "మధురై కుందు భాయ్‌" స్టైల్‌ బిర్యానీ. మరి.. ఈ చికెన్‌ బిర్యానీ ఎలా ప్రిపేర్‌ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మధురై కుందు భాయ్‌ స్టైల్‌ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు :

  • చికెన్‌ - కిలో
  • బాస్మతి రైస్- కిలో
  • వేయించిన ఉల్లిపాయ ముక్కలు- కప్పు
  • పచ్చిమిరపకాయలు- 8
  • లవంగాలు-8
  • దాల్చిన చెక్క-4
  • యాలకులు-7
  • జాపత్రి
  • జాజికాయ
  • మరాఠి మొగ్గ
  • బిర్యానీ ఆకు
  • షాజీరా
  • నిమ్మరసం,
  • అల్లంవెల్లుల్లి ముద్ద
  • జీలకర్ర,
  • ధనియాల పొడి,
  • ఉప్పు- తగినంత,
  • పెరుగు- రెండు కప్పులు,
  • నూనె- తగినంత,
  • కొత్తిమీర, పుదీనా- కప్పు చొప్పున,
  • పాలు- కొన్ని
  • కుంకుమపువ్వు,
  • ఫుడ్ కలర్ (కావాలనుకుంటే)

Sunday Special Non Veg Curries : సండే స్పెషల్.. నాటుకోడి కూర.. బోటీ మసాలా ఫ్రై.. ఇలా చేశారంటే.. బొక్కకూడా వదలరు

బిర్యానీ కోసం చికెన్ మారినేషన్ విధానం :

  • ముందుగా చికెన్‌ ముక్కలను రెండు మూడు సార్లు ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి.
  • తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి చికెన్‌ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
  • ఇప్పుడు నిలువుగా కోసిన పచ్చి మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, లవంగాలు-2, దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ, మరాఠి మొగ్గ, షాజీరా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి.
  • ఆ తర్వాత పెరుగు వేసి మిశ్రమాన్ని బాగా కలిపాలి.
  • ఇప్పుడు వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కాస్తంత నూనె వేసి మరోసారి కలియబెట్టాలి. ఆ తర్వాత దాన్ని ఓ గంట పాటు పక్కన పెట్టాలి.
  • వేరొక గిన్నెలో బాస్మతి బియ్యాన్ని ఇరవై నిమిషాలు నానబెట్టాలి.

దమ్ బిర్యానీ తయారీ విధానం :
ముందుగా స్టవ్‌ మీద గిన్నె పెట్టి నీళ్లు పోయాలి. ఇప్పుడు కప్పు రైస్‌కు నాలుగు కప్పుల వాటర్‌ తీసుకోవాలి. ఆ నీటిని ఉప్పు వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఆ నీటిలోకి ఇందులో షాజీరా, దాల్చిన చెక్క, జాజికాయ, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి కాస్తంత నూనె పోయాలి. తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి ఓసారి కలపాలి. ఇప్పుడు మూడొంతులు ఉడికిన రైస్‌ను వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మ్యారినెట్‌ చేసుకున్న చికెన్‌ బిర్యానీని స్టౌవ్‌పై పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత పక్కన పెట్టుకున్న బాస్మతీ రైస్‌ను చికెన్‌ బిర్యానీలోకి వేసుకోవాలి. ఇప్పుడు వాటిపై కొద్దిగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు, నిమ్మరసం వేసుకోవాలి. మీరు ఇప్పుడు కుంకుమ పువ్వు పాలు లేదా ఫుడ్‌ కలర్, నెయ్యిని కూడా యాడ్‌ చేసుకోవచ్చు. ఆవిరి బయటకు వెళ్లకుండా గిన్నె అంచులను గోధుమపిండితో పూర్తిగా మూసి ఉంచాలి. పైన ఏదైనా బరువు పెట్టాలి.

మొదట పది నిమిషాలు మంట ఎక్కువగా, ఆ తర్వాత మరో 10 నిమిషాలు మధ్యస్థంగా, మరో 10 నిమిషాలు సిమ్​లో ఉండికించుకోవాలి. అంతే.. నోరూరించే ఘుమఘుమలాడే మధురై కుందు భాయ్‌ స్టైల్‌ చికెన్‌ దమ్‌ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీని ఆనియన్‌, ఎగ్‌, లెమన్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే.. ఈ సండే పండగే!

How to Prepare Hyderabadi Chicken Dum Biryani : సండే ధమాకా.. హైదరాబాదీ బిర్యానీ.. ట్రై చేయండిలా..!

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!

ABOUT THE AUTHOR

...view details