తెలంగాణ

telangana

దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు- కొత్తగా లిస్ట్​లోకి 2 కోట్ల మంది యువత

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 4:54 PM IST

Lok Sabha Election 2024 Voters List : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌కు దేశవ్యాప్తంగా దాదాపు 97 కోట్ల మంది అర్హులు అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఎలక్షన్ కమిషన్ తుది ఎలక్టోరల్ రోల్​ గణాంకాలు విడుదల చేసింది.

Lok Sabha Election 2024 Voters List
Lok Sabha Election 2024 Voters List

Lok Sabha Election 2024 Voters List :రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 97 కోట్ల మంది అర్హులు ఉన్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. వారిలో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు ఉన్న రెండు కోట్ల మంది యువత ఓటర్ల జాబితాలో చేరారని తెలిపింది. 2019లో జరిగిన లోక్​సభ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లలో 6 శాతం పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది.

Source : Election Commission Of India

కఠిన పరిశీలన తర్వాత ఈ తుది ఓటర్ల జాబితాను రూపొందించినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. అందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి సమగ్ర ధ్రువీకరణ తర్వాత 67.82 లక్షల మంది చనిపోయినవారి పేర్లు, 22.05 లక్ష నకిలీ ఓట్లను తొలగించినట్లు పేర్కొంది. ముఖ్యంగా గిరిజనలను ఓటర్ల జాబితాలో నమోదు చేయడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసినట్లు తెలిపింది.

ఎన్నికల సంఘం వివరాల ప్రకారం, ఓటుకు అర్హులైనవారిలో దాదాపు 1.84 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్లలోపు వారు ఉన్నారు. 2023తో పోల్చితే లింగ నిష్పత్తి 940 నుంచి 2024లో 948కి చేరినట్లు వెల్లడించింది.

Source : Election Commission Of India
  • మొత్తం ఓటర్లు : 96.88 కోట్లు (96,88,21,926)
  • పురుషులు : 49.72 కోట్లు (49,72,31,994)
  • మహిళలు :47.15 కోట్లు (47,15,41,888)
  • 20-29 ఏళ్ల వయసున్న వారు : 19.74 కోట్లు (19,74,37,160)
  • దివ్యాంగులు :88,35,449
  • వందేళ్లు పైబడినవారు : 2,38,791
  • ఓటర్లు / జనాభా నిష్పత్తి : 66.76
  • లింగ నిష్పత్తి : 948
    Source : Election Commission Of India

జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల తేదీలపై స్పష్టత రావాల్సి ఉంది. గత నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌, మే నెలల్లో జరిగినందున ఈసారీ అవే నెలల్లో జరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఎన్నికలు ఏప్రిల్‌ 11 నుంచి మొదలయ్యాయి. అంటే షెడ్యూల్‌ విడుదలకు, తొలి దశ ఎన్నికకు మధ్య నెల రోజుల సమయం ఉంది. మే 19 వరకు ఏడు దశల్లో పోలింగ్‌ కొనసాగింది.

BJP Focus on Lok Sabha elections 2024 : ముచ్చటగా మూడోసారి కమలం వికసించేనా..!

2024 లక్ష్యంతో భాజపా 'ఆపరేషన్​ 144'.. 'పక్కా లోకల్' స్కెచ్​తో రంగంలోకి మోదీ!

ABOUT THE AUTHOR

...view details