తెలంగాణ

telangana

సార్వత్రిక ఎన్నికల బడ్జెట్​ ఎంతో తెలుసా? ఎలక్షన్లకు అయ్యే ఖర్చు తెలిస్తే షాక్​!

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 9:40 AM IST

Lok Sabha Election 2024 Budget Allocation : భారత ఎన్నికల సంఘం 2024 లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ను శనివారం ప్రకటించనుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వం దీనికి ఎంత బడ్జెట్ కేటాయించింది? మొదలైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ECI budget Allocation For lok sabha elections 2024
election commission of India

Lok Sabha Election 2024 Budget Allocation :ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్​. అందుకే మన దేశంలో లోక్​ సభ ఎన్నికలు నిర్వహించడానికి భారీగా ఖర్చు అవుతుంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు మనవే అని పలు అధ్యయనాలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఎలక్షన్​ బడ్జెట్​
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2024 లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ను శనివారం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్​సభ ఎన్నికలకు ఎంత ఖర్చు కానుంది? దీని కోసం ప్రభుత్వం ఎంత కేటాయించింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ఎన్నికల ఖర్చుల కోసం రూ.2,183.78 కోట్లను కేటాయించారు. అయితే దీనిని 2024 మార్చిలో ప్రవేశపెట్టిన​ మధ్యంతర బడ్జెట్​లో రూ.2,442.85 కోట్లకు పెంచారు.
  • ఈ ఎన్నికల బడ్జెట్​లో రూ.1000 కోట్లను లోక్​ సభ ఎలక్షన్ల కోసం కేటాయించారు. గతేడాది ఇది కేవలం రూ.180 కోట్లు మాత్రమే ఉండేది. అలాగే గతేడాది ఓటర్ ఐడీ కార్డుల కోసం రూ.18 కోట్లు మాత్రమే కేటాయిస్తే, ఈ ఏడాది దానిని రూ.404.81 కోట్లకు పెంచారు.
  • ఈవీఎంల కోసం బడ్జెట్లో రూ.34.84 కోట్లు కేటాయించారు. ఇతర ఖర్చుల కోసం రూ.1,003.20 కోట్లు అలాట్ చేశారు. ఈ విధంగా 2024 ఆర్థిక సంవత్సరంలోని ఎన్నికల నిర్వహణ కోసం మొత్తంగా రూ.2,408.01 కోట్లు కేటాయించారు.

ఎలక్షన్ కమిషన్​కు ఎంత ఇచ్చారంటే?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రూ.321.89 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.306.06 కోట్లను కేవలం ఎన్నికల నిర్వహణ కోసం ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా పబ్లిక్ వర్క్స్​ కోసం రూ.2.01 కోట్లు, అడ్మినిస్ట్రేటివ్​ సర్వీసెస్ కోసం రూ.13.82 కోట్లు కేటాయించారు.

వాస్తవానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ గత ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎన్నికల వ్యయం కోసం రూ.3,147.92 కోట్లు, ఎన్నికల సంఘం నిర్వహణ కోసం రూ.73.67 కోట్లను అదనంగా కేటాయించారు. అయితే అంతకు ముందు ఏడాది ఎన్నికల సంఘానికి కేంద్ర ప్రభుత్వం రూ.466.4 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. 2014 లోక్​ సభ ఎన్నికల్లో ఏకంగా రూ.3,870 కోట్లు ఖర్చు కావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details