తెలంగాణ

telangana

సండే స్పెషల్ - మజానిచ్చే మటన్​ రుచులతో ప్లేట్లు ఖాళీ!

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 5:27 PM IST

Mutton Special Dishes: సండే వచ్చిందంటే.. చాలా మంది మటన్​ తినాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం మార్కెట్​కి వెళ్లి ఇష్టంగా మటన్‌ను తెచ్చుకుంటారు. అయితే.. ఎప్పుడూ చేసే విధంగా ఒక కూర చేసేస్తే ప్రత్యేకత ఏముంటుందీ..? అందుకే ఈసారి ఆకుకూరలు కలిపి కాస్త వెరైటీగా వండేస్తే సరి! రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

Sunday Special
Mutton Special Dishes

Mutton Special Dishes: సండే అంటే.. నాన్​వెజ్​ ప్రియులకు పండగ. ముక్క లేనిదే ఆరోజు పూర్తి కాదు. అయితే.. నాన్​వెజ్​ వెరైటీస్ ఎన్ని ఉన్నా.. మటన్ రేంజ్ వేరే. దీనికి ఫ్యాన్స్​ ఎక్కువే. అయితే.. ఎప్పుడూ ఒకే విధంగా వండుకుంటే స్పెషల్ ఏముంటుంది? అందుకే.. ఈ సారి ఆకుకూరలు కలిపి కాస్త వెరైటీగా వండేస్తే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మరి దానికి కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

హరియాలీ మటన్‌ ఫ్రై

Hariyali Mutton Fry:

కావలసిన పదార్థాలు:

  • మటన్‌-అరకేజీ
  • పసుపు- అరచెంచా
  • ఉప్పు- తగినంత
  • ధనియాలపొడి- టేబుల్‌స్పూను
  • కారం-తగినంత
  • అల్లంవెల్లుల్లి పేస్టు-చెంచా
  • పెరుగు-అరకప్పు
  • ఉల్లిపాయ తరుగు-కప్పు
  • కరివేపాకు-గుప్పెడు
  • జీలకర్ర-చెంచా
  • సోంపు-టేబుల్‌స్పూను
  • లవంగాలు-నాలుగు
  • యాలకులు-రెండు
  • దాల్చిన చెక్క- చిన్న ముక్క
  • నూనె-అరకప్పు
  • కొత్తిమీర తరుగు-పావుకప్పు

How to Prepare Methi Mutton Curry : మటన్​ ఎప్పుడూ ఒకేలా ఏం తింటారు..? ఈ సండే ఇలా ట్రై చేయండి!

తయారీ విధానం:

  • ఓ గిన్నెలో మటన్‌ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, ధనియాలపొడి, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, పెరుగు, రెండు చెంచాల నూనె వేసి బాగా కలిపి మూత పెట్టి ఓ అరగంట పాటు పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు స్టౌ మీద కడాయిని పెట్టి జీలకర్ర, సోంపు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, కరివేపాకు వేయించి మిక్సీ జార్​లో వేసుకుని మెత్తని పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద కుక్కర్​ పెట్టి.. అందులో కలిపి పెట్టుకున్న మటన్‌ ముక్కల్ని వేసుకుని పావు కప్పు నీళ్లు పోసి నాలుగు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. ఒకవేళ మటన్​ ఉడకకపోతే.. మరో రెండు విజిల్స్​ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకుని అందులో ఉడికించిన మటన్‌ ముక్కలు వేయాలి.
  • ఈ కూర ఉడుకుతున్నప్పుడు చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి కలిపి.. కూర పొడిపొడిగా అయ్యాక కొత్తిమీర వేసి దింపేయాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే హరియాలీ మటన్​ రెడీ..!

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!

పాలక్‌ మటన్​:

Palak Mutton:

కావలసినవి..

  • మటన్‌- ముప్పావు కేజీ
  • ఉల్లిపాయలు- నాలుగు
  • అల్లం తరుగు- టేబుల్‌స్పూను
  • వెల్లుల్లి తరుగు- టేబుల్‌స్పూను
  • పచ్చిమిర్చి- నాలుగు
  • పాలకూర తరుగు-రెండు కప్పులు
  • టమాట తరుగు- కప్పు
  • పెరుగు- అరకప్పు
  • జీలకర్రపొడి- చెంచా
  • ధనియాలపొడి- రెండు టేబుల్‌స్పూన్లు
  • బిర్యానీ ఆకులు- రెండు
  • యాలకులు- రెండు
  • లవంగాలు-నాలుగు
  • జాజికాయపొడి-పావుచెంచా
  • నూనె-పావుకప్పు
  • ఉప్పు- తగినంత
  • వెన్న- రెండు టేబుల్‌స్పూన్లు

How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి!

తయారీ విధానం:

  • ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని మిక్సీలో మెత్తగా చేసుకుని గిలకొట్టిన పెరుగులో కలపాలి.
  • ఇప్పుడు ఓ గిన్నెలో మటన్​ ముక్కలు తీసుకుని.. వాటిపైన పచ్చిమిర్చి పేస్ట్​, పావుచెంచా జీలకర్రపొడినీ వేసి కలిపి మూత పెట్టాలి.
  • అలాగే ఓ గిన్నెలో నీళ్లు, పాలకూర తరుగు, అరచెంచా ఉప్పు వేసి స్టౌ మీద పెట్టి... నీళ్లు మరుగుతున్నప్పుడు దింపేయాలి. ఆ నీటిని వంపేసి పాలకూరను ప్యూరీలా చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేసి బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు వేయించుకోవాలి.
  • ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకొని ధనియాలపొడి, జీలకర్రపొడి వేసి, పావుకప్పు నీళ్లు పోయాలి.
  • తరువాత మటన్‌ ముక్కలు, టమాట తరుగు, తగినంత ఉప్పూ(పాలకూరలో ఇంతకుముందే ఉప్పు వేశాం కాబట్టి చూసుకోవాలి) వేసి మరో కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి.
  • మటన్‌ ఉడికాక పాలకూర గుజ్జు, జాజికాయ పొడి వేసి కలిపి కూర దగ్గరకు అయ్యాక దింపేసి వెన్న వేయాలి.

నాన్​వెజ్ స్పెషల్​.. ఊరగాయ మాంసం చేయండిలా!

సింపుల్​గా హైదరాబాదీ మటన్ పాయ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details