తెలంగాణ

telangana

ఆపరేషన్ చేసి కడుపులో కాటన్​ పెట్టిన డాక్టర్​- యువకుడి ఆరోగ్యం సీరియస్​- చివరకు - Doctor Left Cotton in Stomach

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 1:52 PM IST

Doctor Left Cotton In Patient Stomach : ఆపరేషన్ చేసిన తర్వాత దూది పేషెంట్​ కడుపులో పెట్టి కుట్టేశాడు ఓ డాక్టర్​. దీంతో పేషెంట్​ ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరాడు. అనంతరం కడుపులో కాటన్ ఉందని గుర్తించిన వైద్యులు బయటకు తీశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో జరిగింది.

Doctor Left Cotton In Patient Stomach
Doctor Left Cotton In Patient Stomach (ETV Bharat)

Doctor Left Cotton In Patient Stomach :ఆపరేషన్ తర్వాత ఓ డాక్టర్ పేషెంట్​ కడుపులో దూదిని వదిలేశాడు. డిశ్చార్జ్​ అయిన తర్వాత రోగి పరిస్థితి మరింత దిగజారింది. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్​లో దూది ఉన్న విషయం తెలియడం వల్ల కుటుంబసభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో జరిగింది.

ఇదీ జరిగింది
బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మేరఠ్​ లోహియానగర్ ప్రాంతంలోని హాపుర్ రోడ్‌లో ఓ నర్సింగ్‌హోమ్‌ ఉంది. అదే ప్రాంతానికి చెందిన సల్మాన్‌కు ఆ ఆస్పత్రిలో గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. గత నెలలో ఓ వైద్యుడు ఈ ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో కడుపులోనే దూదిని వదిలేశాడు వైద్యుడు. సర్జరీ తర్వాత పేషెంట్​ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

అయితే ఇంటికి చేరుకున్న తర్వాత సల్మాన్‌ ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో బాధితుడిని మేరఠ్​లోని గర్ రోడ్‌లో ఉన్న మరొక ఆసుపత్రికి తీసుకెళ్లి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించారు. అనంతరం కడుపులో దూది ఉండటం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి కాటన్ స్ట్రిప్​ను తొలగించారు. అయితే తప్పు చేసినా, ఆస్పత్రి వర్గాలు అంగీకరించడం లేదని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడని బిలాల్​ వాపోయాడు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని సీఎంఓకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా, దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు లోహియా నగర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి సంజయ్ సింగ్ తెలిపారు. నిందుతుడిని విచారిస్తున్నామని వెల్లడించారు. విచారణలో తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సర్జరీ మధ్యలో ఆపిన డాక్టర్
శస్త్రచికిత్స పూర్తి కాకుండానే ఆపరేషన్​ థియేటర్​ నుంచి ఓ డాక్టర్ బయటకు వచ్చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​ జిల్లాలో జరిగింది. సర్జరీ చేయకుండా డాక్టర్​ వచ్చేసిన ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

'కేజ్రీవాల్​ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్​జీదే'- పిటిషన్​ కొట్టివేసిన సుప్రీం - Aravind Kejriwal Supreme Court

CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల- మళ్లీ అమ్మాయిలే టాప్​ - CBSE Class 12 results

ABOUT THE AUTHOR

...view details