తెలంగాణ

telangana

'కాంగ్రెస్ ఖాతాల నుంచి అక్రమంగా రూ.65కోట్లు విత్​డ్రా'- ఐటీ శాఖపై హస్తం పార్టీ ఫైర్​

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 4:49 PM IST

Updated : Feb 21, 2024, 6:39 PM IST

Congress Account Freeze : ఆదాయపు పన్ను శాఖ వివిధ బ్యాంకుల్లోని తమ పార్టీకి చెందిన ఖాతాల నుంచి అప్రజాస్వామికంగా రూ.65 విత్​డ్రా చేసిందని కాంగ్రెస్​ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ కోశాధికారి అజయ్​ మాకెన్​ సామాజిక మాధ్యమం ఎక్స్​లో పోస్ట్ చేశారు.

Congress Account Freeze
Congress Account Freeze

Congress Account Freeze :వివిధ బ్యాంకుల్లో ఉన్న తమ ఖాతాల నుంచి రూ.65 కోట్లను ఆదాయపు పన్ను శాఖ అప్రజాస్వామికంగా విత్‌డ్రా చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. పన్ను రికవరీకి చెందిన అంశం న్యాయ పరిధిలో ఉన్నా, ఇలా వ్యవహరించడమేంటని ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యం అంతమైపోతుందని పేర్కొన్నారు. తమకు న్యాయ వ్యవస్థ పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఖాతాల జప్తుపై ఆదాయపు పన్ను అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ విచారణ చేపడుతున్నా, వివిధ బ్యాంకుల్లోని కాంగ్రెస్‌, యూత్‌ కాంగ్రెస్‌కు చెందిన ఖాతాల నుంచి రూ.65 కోట్లను విత్‌డ్రా చేయాలని ఐటీ శాఖ బ్యాంకులకు లేఖలు రాసిందని ఆరోపించారు. ఈ కేసు న్యాయ పరిధిలో ఉన్నందును నగదను విత్‌డ్రా చేయవద్దని బ్యాంకులకు తమ పార్టీ తరఫున లేఖ రాసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేఖ వైఖరికి కాంగ్రెస్‌ బలిపశువుగా మారిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఉన్న రూ.115 కోట్ల పన్ను బకాయిల్లో రూ.65 కోట్లను రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఖాతాల నుంచి రికవరీ చేసినట్లుగా సమాచారం. అయితే దీనిపై హస్తం పార్టీ ఆదాయపు పన్ను శాఖ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆశ్రయించింది. ఆదాయపు పన్ను శాఖ తమ అకౌంట్ల నుంచి డబ్బును రికవరీ చేయడంపై ట్రైబ్యునల్​కు ఫిర్యాదు చేసింది. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకునేంత వరకు నగదును విత్​డ్రా చేయవద్దని ఆదాయపు పన్ను శాఖను కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ అంశంపై విచారణ చేపట్టేంత వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ట్రైబ్యునల్ సూచించింది.

అంతకుముందు కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాలుగు ప్రధాన బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ వెల్లడించారు. అందులో యూత్ కాంగ్రెస్ ఖాతాలు సైతం ఉన్నట్లుగా తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ తాము పంపిన నోటీసులకు సరిగా స్పందించలేదని, జరిమానా కూడా చెల్లించలేదని తెలిపింది. అందుకే ఖాతాలు స్తంభింపజేశామని గతంలో ఆదాయపు పన్ను శాఖ వివరించింది. 2018-19లో విధించిన జరిమానా, నోటీసులకు ఇప్పటివరకు స్పందించలేదని వివరించింది. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

'ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్'- రాహుల్ న్యాయ్​ యాత్రపై ఎఫెక్ట్!

'రాహుల్​జీ, ప్రధాని కావాలంటే మీరు కూడా బీజేపీలోకి వెళ్లండి'

Last Updated : Feb 21, 2024, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details