తెలంగాణ

telangana

అయోధ్య రామయ్యకు కానుకగా 1100కిలోల తబలా- వాయిస్తే కొన్ని కి.మీ వరకూ శబ్ధమే!

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 5:13 PM IST

1100 KG Drum To Ayodhya Ram Mandir : 1100 కిలోల భారీ తబలాను అయోధ్య బాలక్​రామ్​కు కానుకగా సమర్పించారు మధ్యప్రదేశ్​ చెందిన కొందరు రామభక్తులు. బుధవారం ఈ భారీ కానుకను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులకు అందజేశారు.

1100 Kg Drum To Ayodhya Ram Mandir
1100 Kg Drum To Ayodhya Ram Mandir

అయోధ్య రాముయ్యకు కానుకగా 1100కిలోల తబలా- వాయిస్తే కొన్ని కి.మీ వరకూ శబ్ధమే!

1100 KG Drum To Ayodhya Ram Mandir :ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య బాలరాముడికి ఇంకా కానుకలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 2500 కిలోల భారీ గంట, 400 కిలోల తాళం, 108 అడుగుల బాహుబలి అగరుబత్తి సహా ఎన్నో రకాల కానుకలను అందించిన రామ భక్తులు తాజాగా మరో భారీ కానుకను రామయ్యకు సమర్పించారు. 1100 కిలోల బరువున్న భారీ సంగీత వాయిద్యం- తబలాను అయోధ్య రాముడి కోసం తీసుకువచ్చింది మధ్యప్రదేశ్​కు చెందిన శివ బరాత్​ జన్​ కళ్యాణ్​ సమితి బృందం. బుధవారం దీనిని రామసేవక్​ పురంలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది.

గిన్నిస్​లో తబలా
మధ్యప్రదేశ్​లోని రీన్వా జిల్లా నుంచి ప్రత్యేక వాహనంలో ఈ భారీ తబలాను బుధవారం అయోధ్యకు తీసుకువచ్చారు. ఇక్కడకు చేరుకున్నాక ఓ భారీ క్రేన్​ సాయంతో డప్పుల నడుమ రామనామస్మరణ చేసుకుంటూ నృత్యాలతో తబలాను అయోధ్యకు చేర్చారు భక్తులు. అయితే ఈ తబలాను ప్రపంచంలోనే అతిపెద్ద డ్రమ్ముగా అభివర్ణిస్తున్నారు దీని తయారీదారులు. అంతేగాక దీనికి ఇప్పటికే గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు కూడా దక్కిందని చెబుతున్నారు.

తబలా తయారీలో ముస్లింలు
టన్నుకు పైగా బరువున్న ఈ తబలా ఎత్తు 6 అడుగులు, వెడల్పు 33 అడుగులు. దీనిని తయారు చేయడానికి 3 నెలల సమయం పట్టిందని నిర్వాహకులు తెలిపారు. అలీగఢ్​​, కాన్పుర్​, ప్రయాగ్‌రాజ్‌, మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలకు చెందిన కళాకారులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం కళాకారులు కూడా ఈ తబలా తయారీలో పాల్గొన్నారని చెప్పారు. ఇది గంగా-యమున సంస్కృతికి ప్రతీక అని అన్నారు. ఈ తబలా వాయించినప్పుడు దీని శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుందని తెలిపారు.

'ఈ భారీ తబలాను అయోధ్య రాముడికి అంకితం చేస్తున్నాం. గతేడాది మహాశివరాత్రి రోజున 5,100 కిలోల కిచిడిని వండి పంపిణీ చేసి రికార్డు సృష్టించాం. ఇక ఈ ఏడాది కూడా కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నాం. అందులో నుంచి వచ్చిన ఆలోచనే ఈ 1100 కిలోల డ్రమ్ము తయారీ' అని చెప్పారు తబలా తయారీదారు కమిటీ కార్యదర్శి ప్రతీక్​ మిశ్రా.

చెక్కపై హనుమాన్​ చాలీసా!
Wooden Hanuman Chalisa In Ayodhya : మరోవైపు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన కొందరు రామ భక్తులు 6.9 అడుగుల ప్లైవుడ్​పై శ్రీ హనుమాన్​ చాలీసాను చెక్కి బాలరాముడి కోసం అయోధ్యకు తీసుకువచ్చారు. దీనిని కూడా బుధవారం అయోధ్యలోని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులకు అందజేశారు. చెక్కపై హనుమాన్​ చాలీసాను చెక్కడానికి 3 నెలల సమయం పట్టిందని తయారీదారు అరుణ్​ కుమార్ తెలిపారు​. 'శ్రీరాముడిపై వీరంతా చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషం. ఈ బహుమతులన్నింటినీ జాగ్రత్తగా భద్రపరుస్తాం. అవసరానికి వాటిని వినియోగిస్తాం' అని ట్రస్టు సభ్యుడు డాక్టర్​ అనిల్​ మిశ్రా తెలిపారు.

ప్లైవుడ్​పై హనుమాన్​ చాలీసా

నేరుగా ఇంటికే అయోధ్య 'హనుమాన్​' ప్రసాదం- మనీ ఆర్డర్ చేస్తే చాలు!

'డిసెంబర్​ నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి'- బాలక్​రామ్​ను దర్శించుకున్న 75లక్షల మంది భక్తులు

ABOUT THE AUTHOR

...view details