CCTV Video: ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భస్థ శిశువు సహా ముగ్గురు దుర్మరణం
Published on: Sep 17, 2022, 7:03 PM IST

కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. చిక్కబళ్లాపుర్ జిల్లాలోని జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భస్థ శిశువు సహా ముగ్గురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయరహదారిపై అతివేగంతో వెళ్తున్న ట్రక్కు.. ముందున్న కారును తప్పించబోయి అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని.. రోడ్డు పక్కన హోటల్ముందు నిలిపి ఉంచిన వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్ సెక్యూరిటీ గార్డుతోపాటు ద్విచక్రవాహదారుడు అక్కడికక్కడే మృతిచెందారు. ఓ గర్భిణీ తీవ్రంగా గాయపడగా.. ఆమె కడుపులోని శిశువు చనిపోయింది. గాయపడినవారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ట్రక్కు డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. వాహనాన్ని సీజ్ చేశారు.
Loading...