స్ట్రెచర్​పై పడుకునే ఎగ్జామ్ రాసిన విద్యార్థి- ఏం డెడికేషన్ గురూ!

By

Published : May 18, 2022, 10:31 AM IST

thumbnail

తీవ్రంగా గాయపడి, మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్నా... స్ట్రెచర్​పై పడుకునే పరీక్ష రాసి అందరితో శెభాష్ అనిపించుకున్నాడు ఓ విద్యార్థి. తమిళనాడు తిరునెల్వేలిలోని పెట్టైలో మంగళవారం జరిగిందీ ఘటన. ప్లస్​2 చదువుతున్న అజారుద్దీన్​.. ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. పాళయంకొట్టై ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేసి, కాలుకు పెద్ద కట్టు కట్టారు. కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే.. పరీక్షలు మానడం ఏమాత్రం ఇష్టం లేని అజారుద్దీన్.. అంబులెన్స్​లోనే పరీక్ష కేంద్రానికి వచ్చాడు. అక్కడి ఉపాధ్యాయులకు విషయం చెప్పి.. స్ట్రెచర్​పై పడుకునే మ్యాథ్స్ ఎగ్జామ్ రాశాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.