స్కూల్​కు తల్వార్​తో విద్యార్థి తండ్రి.. యూనిఫాం డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటూ...

By

Published : Jul 8, 2022, 6:37 PM IST

thumbnail

బిహార్ ఆరారియాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. భగవాన్​పుర్​లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోన్న ఓ విద్యార్థికి యూనిఫాం డబ్బులు రాలేదని అతడి తండ్రి హల్​చల్​ చేశాడు. 24 గంటల్లో డబ్బులు ఇవ్వాలని అక్బర్​ అనే వ్యక్తి పెద్ద కత్తితో ఉపాధ్యాయులను బెదిరించాడు. వారిని అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ ఘటనతో పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. డీఈఓకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.