పాఠశాలలోకి ప్రవేశించిన ఎలుగుబంటి.. విద్యార్థులు హడల్​!

By

Published : Jun 18, 2022, 10:22 AM IST

Updated : Jun 18, 2022, 11:16 AM IST

thumbnail

Bear Entered Into School: జనావాసాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతోంది. పులులు, ఏనుగులతో పాటు ఎలుగుబంట్లు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్​​లోని బరబస్​పుర్​ పాఠశాలలో ఓ ఎలుగుబంటి హల్​చల్​ సృష్టించింది. పాఠశాల ఆవరణలో భల్లూకం సంచరించడం వల్ల గ్రామస్థులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. గ్రామస్థులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు గోడ పోస్టర్లు కూడా అంటించారు. ఎలాంటి సమయంలోనైనా ఎలుగుబంటి కనిపించినా.. వెంటనే అటవీశాఖ బృందానికి తెలియజేయాలని తెలిపారు. ఎలుగుబంటి సంచరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

Last Updated : Jun 18, 2022, 11:16 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.