Prathidwani: కరోనా వైరస్‌ కట్టడిలో టీకా బూస్టర్ డోస్ పాత్ర ఏంటి?

By

Published : Sep 27, 2021, 9:22 PM IST

thumbnail

కొవిడ్‌ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా కాపాడే మెరుగైన రక్షణ... బూస్టర్‌ డోస్. టీకా... ఒకటి, రెండు డోసులతో శరీరంలో కొవిడ్‌ యాంటీబాడీస్‌ తయారవుతాయి. దీంతో ప్రాథమికంగా రోగనిరోధక వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే... ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ బలం పెంచుకుంటోంది కరోనా వైరస్‌. కొత్త మ్యుటేషన్లతో సవాలు విసురుతున్న కొవిడ్‌ ఆటకట్టించేందుకు ఈ బూస్టర్‌ డోస్‌ అదనపు శక్తిని అందిస్తుందని వైజ్ఞానిక రంగం భావిస్తోంది. అందుకే ఈ దిశగా ప్రయోగాలు, పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. వాటి ఫలితాల కోసం ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. కొత్త కొత్త వేరియంట్లుగా రూపం మార్చుకుని మానవాళిపై విరుచుకు పడుతున్న కొవిడ్‌ కోరలు పీకే ఆయుధంగా భావిస్తున్న బూస్టర్ డోస్‌ సమర్థత ఎంత? అసలు ఈ డోస్‌ ఎవరికి అవసరం? ఎప్పుడు అవసరం? అనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.