దిల్​సుఖ్​నగర్​లో ఐదేళ్ల బాలుడిపై కుక్క దాడి - సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాలు

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 4:38 PM IST

thumbnail

Video Viral Dog Attack on 5 Years Boy in Dilsukhnagar : హైదరాబాద్​లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం దిల్‌సుఖ్‌నగర్‌లోని శాంతినగర్​కి చెందిన బిట్టు (5) ఇంటి  ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఇంటిముందు ఆడుకుంటున్నాడు.  అటువైపుగా వచ్చిన కుక్కలు ఆ ముగ్గురిని వెంబడించాయి. దీంతో పరుగులు పెడ్డిన ఆ పిల్లల్లో బిట్టు కిందపడబోతుండగా వెంబడించిన కుక్క ఇంటి గేట్​లోకి ప్రవేశించి బాలుడిని కరిచింది. దీంతో  తీవ్ర గాయాలపాలైన బాలుడుని నారాయణగూడలోని ప్రభుత్వ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. 

వీధుల్లో కుక్కలు తిరుగుత్నాయని అధికారులకి అనేకసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కనీసం ఇప్పుడైన అధికారులు స్పందించాలని కోరుతున్నారు. నగరంలో కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్నా, అధికారులు మాత్రం ఫిర్యాదు చేసిన సమస్యలపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.