జేసీబీపై విరిగిపడిన బండరాళ్లు.. లోయలో పడ్డ వాహనం.. లైవ్​ వీడియో

By

Published : Aug 17, 2023, 3:20 PM IST

thumbnail

Uttarakhand Landslide 2023 : బండరాళ్లను తొలగిస్తున్న ఓ జేసీబీపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో జేసీబీలో లోయలో పడిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ పితోర్‌గఢ్‌ జిల్లాలో జరిగింది. జేసీబీ డ్రైవర్‌ పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఇంకా తెలియరాలేదు. ధర్చులా ప్రాంతంలోని టవాఘాట్‌-సోబ్లా రహదారిపై ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ కొండచరియలను అధికారులు జేసీబీలతో తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పర్వతం పైనుంచి భారీ బండరాళ్లు ఓ జేసీబీపై జారి పడ్డాయి. 
మరోవైపు.. దెహ్రాదూన్​ జిల్లాలోని లంఘా జఖాన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడడం వల్ల 15 ఇళ్లు, ఏడు గోశాలలు ధ్వంసమయ్యాయి.

Uttarakhand Floods Today : గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అకాల వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహించడం సహా పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల జాతీయ రహదారులు బ్లాక్‌ అయ్యాయి. దెహ్రాదూన్‌, పౌరి, టెహ్రి, నైనితాల్‌, చంపావత్‌, ఉధం సింగ్‌ నగర్‌ జిల్లాల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.