విద్యార్థులే సేవకులు!.. విసనకర్రతో గాలి విసిరించుకున్న మహిళా టీచర్లు..

By

Published : Aug 19, 2023, 10:36 PM IST

Updated : Aug 20, 2023, 8:03 AM IST

thumbnail

Teachers Used Students Like Fan : విద్యార్థులతో గాలి విసిరించుకున్నారు ఇద్దరు మహిళ టీచర్లు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని హాపుడ్​ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే స్కూల్​కు చెందిన ఈ ఇద్దరు టీచర్లు.. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విసనకర్ర సాయంతో చిన్నారులతో గాలిని విసిరించుకున్నారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన ఓ పేరెంట్.. అనంతరం సామాజిక మాద్యమాల్లో దాన్ని పోస్ట్​ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సింబావోలి ప్రాంతంలోని పిర్‌నగర్ గ్రామంలోని స్కూల్​లో ఈ ఘటన జరిగింది.

ఈ వీడియోలో ఒక టీచర్​ జెండాపై పువ్వులు ఉంచుతూ.. విసనకర్ర సాయంతో విద్యార్థితో గాలి విసిరించుకున్నారు. మరో ఉపాధ్యాయురాలు​ కుర్చీలో కూర్చుని ఇదే తరహా ఘటనకు పాల్పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. వీరి వీడియో కాస్త జిల్లా విద్యాధికారి చెంతకు చేరింది. వెంటనే దీనిపై విచారణ జరిపిన జిల్లా విద్యాధికారి.. ఇద్దరూ మహిళా టీచర్లపై చర్యలు తీసుకున్నారు. వారిని విధుల నుంచి సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Last Updated : Aug 20, 2023, 8:03 AM IST

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.