అపాయమెరుగని ప్రయాణమే మేలన్నా - బతకడానికి డ్రైవింగ్ చేయన్నా

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2023, 2:46 PM IST

thumbnail

Traffic Awareness Songs by Young Singer Sunil Kumar : పేదరికంతో పోరాడుతూ మరోపక్క చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడా యువకుడు. కుటుంబ బాధ్యతను మోస్తూ, కష్టపడి చదివి పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. అలవాటును, ఇష్టాన్ని లక్ష్యంగా పెట్టుకుని సంగీతం వైపు పయనించాడు. సమాజంపై తనకున్న గౌరవాన్ని, ప్రేమను పాటల రూపంలో పాడుతూ, ప్రజలను చైతన్యపరచటంలో తనదైన పాత్ర వహిస్తున్నాడు, జహీరాబాద్‌కు చెందిన సునీల్‌ కుమార్‌. నిత్యం చావుకేక వినిపించే రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలను అవగాహన పరచాలనే సదుద్దేశంతో తనదైన శైలిలో గళమెత్తి, సరళ భాషలో పాటలు పాడుతూ అందరికీ చేరువవుతున్నాడు.

Social Awareness Songs : అనతికాలంలోనే తన గేయ రచనలతో అందరి మన్ననలు పొందాడు. ఇటీవల ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పాట రాసి కలెక్టర్‌ చేత అభినందలను అందుకున్నాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకున్నాడు. మరి, ఉన్నత చదువు అభ్యసించిన అతనికి సమాజాన్ని చైతన్యపరిచే పాటలను రాయాలని ఎందుకనిపించింది? భవిష్యత్‌ లక్ష్యం ఏంటి? అటువంటి ప్రశ్నలకు సమాధానం కోసం ఆ యువ గాయకుడును పలకరించింది ఈటీవీ భారత్. ఆ విశేషాలేంటో అనిల్‌ కుమార్‌ మాటల్లోనే విందామా మరి?

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.