డ్రగ్స్ రహిత రాష్ట్రం - చేరేదెలా గమ్యం

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2023, 8:54 PM IST

thumbnail

Prohibition of Drugs in Telangana : రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌ మహమ్మారిపై యుద్ధం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే కఠిన చర్యలకు సిద్ధం అవుతోంది. తెలంగాణలో ఎక్కడా డ్రగ్స్ మాట వినిపించకూడదన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలకు మేరకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మత్తుపదార్థాల నిర్మూలనలో ప్రజలందరూ కలిసి పోరాడుదామని రాష్ట్ర డీజీపీ పిలుపునిచ్చారు. 

CP Warns Drugs Gangs : రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ఇప్పటికే పోలీసు అధికారులు ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు డేగ కళ్లతో గాలిస్తున్నారు. డ్రగ్స్‌ ముఠాలు, వినియోగదారులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సరం రానున్న వేళ డ్రగ్స్​తో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరి ప్రభుత్వం, పోలీసుల ఈ వరస నిర్ణయాల వెనక కారణమేంటి ? డ్రగ్స్‌ రహిత రాష్ట్ర గమ్యం చేరే ప్రణాళికలెలా ఉండాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.