TS Secretariat: కొత్త సచివాలయం డ్రోన్​ విజువల్స్.. అద్దిరిపోయాయంతే..!

By

Published : Apr 28, 2023, 7:50 PM IST

thumbnail

Telangana New Secretariat Drone Visuals: భాగ్యనగరంలో సాగరతీరాన రాష్ట్ర నూతన సచివాలయం ఆకట్టుకుంటోంది. సువిశాలంగా పచ్చిక బయళ్ల మధ్య అత్యాధునిక భవనం కొలువైంది. భవన నిర్మాణం మొదలు ఫర్నీచర్ వరకు అంతా ఏకరూపంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలంకరణలు, కొత్త ఫర్నీచర్‌తో భవనం లోపల ఛాంబర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అందంగా, ఆకర్షణీయంగా నిర్మించిన పరిపాలనా సౌధం తెలుపు రంగులో మెరిసిపోతోంది. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో కేవలం పది శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో ప్రధాన భవనాన్ని నిర్మించారు. పది ఎకరాల్లో పచ్చిక బయళ్లను అభివృద్ధి చేశారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బంది కోసం ఛాంబర్లు, వర్క్ స్టేషన్లను తీర్చిదిద్దారు. విశాలమైన కారిడార్లతో పర్యావరణ హితంగా భవనాన్ని నిర్మించారు. గ్రీన్ బిల్డింగ్స్ నిబంధనలను పాటించారు. మొత్తం భవనాన్ని ప్లగ్ అండ్ ప్లే విధానంలో సిద్దం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చిత్రీకరించిన డ్రోన్ దృశ్యాలు భవనాన్ని మరింత అందంగా కళ్లకు కడుతున్నాయి. విశాలమైన రహదార్లు, పెద్ద లాన్స్ మధ్య శ్వేతవర్ణంలో, నీలి రంగు అద్దాలతో భవనం కట్టిపడేస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.