Video : బాలికపై వీధికుక్కల దాడి.. ఒకేసారి గుంపుగా వెంటాడి, చుట్టుముట్టి..

By

Published : Jun 20, 2023, 2:37 PM IST

thumbnail

Stray Dogs Kerala : 9 ఏళ్ల బాలికపై వీధికుక్కలు భీకరంగా దాడి చేశాయి. వెంటపడి.. చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచాయి. బాలిక కేకలు విన్న కుటుంబ సభ్యులు రక్షించి.. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కేరళలో జరిగింది.  
ఇదీ జరిగింది.. కన్నూరు జిల్లా ఎడక్కడ్​ మండలం ముజుపిలంగఢ్​ గ్రామానికి చెందిన మూడో తరగతి బాలిక (9 ఏళ్లు).. సోమవారం బయటకు వెళ్లింది. సాయంత్రం ఎడక్కడ్​ రైల్వే స్టేషన్​ వెనుక ఉన్న తన ఇంట్లోకి వెళ్లేందుకు గేటు తెరించింది. ఇంతలో ఆమెను వీధికుక్కలు వెంబడించాయి. అనంతరం చుట్టుముట్టి భీకరంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాలిక కింద పడి కేకలు వేసింది. ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులు కాపాడి.. కన్నూర్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  

వీధికుక్కల దాడి.. రక్తపుమడుగులో చిన్నారి..
దేశవ్యాప్తంగా ఇలాంటి దాడులు జరుతున్నాయి. ఏప్రిల్​లో తెలంగాణలోని మెదక్​ జిల్లా నర్సాపూర్​ మున్సిపాలిటీకి చెందిన ఓ బాలికపై కూడా వీధికుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలిక తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు బాలిక కేకలు విని.. రక్తపుమడుగులో పడి ఉన్న చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ వీధికుక్కల దాడి సీసీటీవీలో రికార్డయ్యింది. ఆ వీడియా చూడాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.