Waranagal Residential School Student Suspicious Injuries : ఆడుకుంటూ కింద పడిన విద్యార్థి... దెబ్బతిన్న వెన్నెముక.. నిజమెంత..?

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2023, 5:03 PM IST

thumbnail

Waranagal Residential School Student Suspicious Injuries :  వరంగల్‌ జిల్లాలో గిరిజన పాఠశాలలో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. సోమవారం సెలవు కావడంతో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటూ కింద పడిందంటూ... ఉపాధ్యాయులు నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.

ఇంటికి వెళ్లిన ఆ బాలిక పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుపోయి చికిత్స చేయిస్తున్నట్లు తండ్రి తెలిపారు. రెండు కాళ్ల మడమలు విరగడంతో పాటు... బాలిక వెన్నెముక సైతం దెబ్బతిన్నాయి. ఆడుకుంటూ కింద పడితే.. ఇంతటి గాయాలు కావడమేంటి అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా బాధితురాలిని చదువు విషయంలో తోటి విద్యార్థులు వేధిస్తున్నారని ఆ కారణంతోనే పాఠశాలపై నుంచి దూకినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ ఈ విషయంపై బాధిత బాలిక కూడా ఏమీ చెప్పడం లేదు. ఈ ఘటనపై నర్సంపేట ఏసీపీ తిరుమల్‌, తహసిల్దార్‌ రాజేశ్‌ ఆశ్రమాన్ని తనిఖీ చేసి ఆరాతీశారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.