వర్షాల బీభత్సం.. చూస్తుండగానే కుప్పకూలిన రిసార్ట్.. లైవ్​ వీడియో

By

Published : Jul 28, 2023, 6:36 PM IST

thumbnail

Resort Collapse In Uttarakhand : ఉత్తరాఖండ్​లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల ధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. కొన్ని చోట్ల వాగులు తమ ప్రవాహ దిశను మార్చుకుంటున్నాయి. ఫలితంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. రుద్రప్రయాగ్​లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల కారణఁగా కేదర్​నాథ్ హైవేపై ఉన్న ఓ రిసార్ట్ కుప్పకూలిపోయింది. బదాసు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చూస్తుండగానే రిసార్ట్.. లోయలో పడిపోయింది. ముందుజాగ్రత్తగా రిసార్ట్​లో ఉన్నవారిని ఖాళీ చేయించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లైంది. 

జులై 18న ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు తమ ప్రవాహాన్ని మార్చుకున్నాయని, ఫలితంగా రిసార్ట్ కింది భూభాగం బలహీనంగా మారిపోయిందని రెస్టారెంట్ యజమాని అవతార్ సింగ్ తెలిపారు. రిసార్ట్ గోడలు దెబ్బతిన్నాయని, ఈ క్రమంలోనే ఆ నిర్మాణం కుప్పకూలిందని చెప్పారు. రిసార్ట్ కూలడం వల్ల రహదారి సైతం దెబ్బతింది. కొంతభాగం రోడ్డు ధ్వంసమైంది. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.