50 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలోనే చేసి చూపించాను : మంత్రి పువ్వాడ అజయ్

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 6:39 AM IST

thumbnail

Puvvada Ajay About Telangana Assembly Elections : అభివృద్ధి, స్థానికత నినాదంతోనే మూడోసారి ఖమ్మం ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నానని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలోనే చేసి చూపించానన్నారు. ఖమ్మం నియోజకవర్గాన్ని 3 కోట్ల నిధులతో సమగ్రమైన, సమ్మిళితమైన నగరంగా తీర్చిదిద్దానని తెలిపారు. ఖమ్మం భూమిపుత్రుడినైన తనకున్న ఆతృత, తనకున్న కమిట్​మెంట్ మరే నాయకుడికి ఉండదని.. అందుకే ఖమ్మం ప్రజలు తనను మరోసారి ఆశీర్వదిస్తారన్ననమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. 

Puvvada Ajay Comments on Tummala :  ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి ప్రజల ఇంటి ముందు ఉందని.. అభ్యర్థిగా తాను ప్రజల కళ్లముందు ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఏనాడూ ప్రజల కోసం ఆరాటపడలేదని.. కేవలం తన పదవులు, స్వార్థం కోసం మాత్రమే ఆరాటపడ్డారని విమర్శించారు. శిఖండి రాజకీయాలకు తెరలేపి తుమ్మల దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం నగరాన్ని సుందరంగా నందనవనంగా తీర్దిదిద్దిన తనను నియోజకవర్గ ప్రజలు మరోసారి నిండుమనసుతో ఆశీర్వదిస్తారంటున్న పువ్వాడ అజయ్ కుమార్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.