Prathidwani : ఎన్నికల వేళ... రూ.2వేల నోట్ల రద్దు ప్రభావం ఎలా ఉండొచ్చు?

By

Published : May 20, 2023, 10:44 PM IST

thumbnail

How to control black money in elections : దేశంలో 2వేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకుంటూ రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నోటిఫికేషన్ ప్రకటించిది. మరి అందుకు దారి తీసిన పరిస్థితులు.. ఈ నిర్ణయం ద్వారా కేంద్రం ఆశిస్తున్న లక్ష్యం ఏమిటి ? ఎన్నికల్లో ధన ప్రవాహం తగ్గించడం, మరీ ముఖ్యంగా నల్లధనానికి అడ్డుకట్ట వేయడంలో 2 వేల రూపాయల నోట్ల రద్దును ఒక కీలకమైన నిర్ణయం అనుకోవచ్చా? 

ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో ఎన్నికలకు భారీగా ఖర్చు చేస్తున్నారు. దక్షిణాదిలో తెలుగురాష్ట్రాల్లో ఎన్నికలు మరీ ఖరీదుగా మారాయి. ఎన్నికల ప్రక్రియను రాజకీయపార్టీలు అపహాస్యం చేస్తున్నాయి. మునుగోడులో కొన్నిచోట్ల ఓటుకు రూ.5వేలు పంచినట్లు ప్రచారం జరిగింది. కీలకస్థానాల ఎన్నికల్లో డబ్బుప్రభావం సాధారణంగా మారింది. పేరుకు మాత్రమే ఎన్నికల వ్యయ పరిమితి ఉన్నా.. విచ్చలవిడిగా డబ్బు పంచినా ఎటువంటి కేసుల్లేవు. అతి సమీపంలో ఎన్నికల ముందు నిలిచిన ఉభయ తెలుగు రాష్ట్రాలపై 2వేల రూపాయల నోటు రద్దు ప్రభావం ఎలా ఉండొచ్చు?  కేంద్రప్రభుత్వం అసలు ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.