ఓటు హక్కే కాదు! బాధ్యత కూడా- గతంలో కంటే మెరుగైన పోలింగ్​ శాతం వచ్చేందుకు ప్రయత్నాలు

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 10:02 PM IST

thumbnail

Pratidhwani on Telangana Election Polling : ఓటు హక్కే కాదు! బాధ్యత కూడా! ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లడం, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిఒక్కరు తమఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం ఎలా? నెలన్నర పాటు హోరాహోరీగా సాగిన పార్టీల ప్రచారం పరిసమాప్తం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి నెలకొన్నది ఓటు వినియోగంపైనే.  ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఓటు వినియోగంపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఓటు హక్కు వినియోగించకపోతే జరిగే నష్టాన్ని తెలియజేసేందుకు కార్యక్రమాలు నిర్వహించింది. రాజకీయపార్టీలతో పాటు సామాజికవేత్తలు, మేధావివర్గాన్ని.. కొన్ని స్థానాల్లో పోలింగ్‌ శాతాలు చాలా నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. ఈసారైనా ఈ పరిస్థితి మార్చడానికి ఏం చేయాలి?

Telangana Assembly Elections 2023 : రాష్ట్రం, రాష్ట్ర ప్రజల అయిదేళ్ల తలరాతను నిర్దేశించేది ఎవరో ఎంచుకోవడానికి మరికొద్ది గంటలే సమయం మిగిలి ఉంది. ఈ విషయంలో ఎలాంటి ప్రలోభాలు, ప్రభావాలకు లొంగకుండా, లోనుకాకుండా ఓటుహక్కును వజ్రాయుధంలా సంధించేందుకు ప్రతి ఒక్కరు తప్పక గమనంలో పెట్టుకోవాల్సిన అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.