నడుస్తున్న తెలంగాణ రాజకీయం, గెలుపు ఎవరి సొత్తు?

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2023, 10:00 PM IST

thumbnail

Prathidwani Debate on Telangana Political Affairs : రాష్ట్రంలో ఎన్నికల కోలహలం కనిపిస్తోంది. అభ్యర్థుల నామినేషన్లు, ప్రచారాలతో పల్లెలు పట్టణాలు హడావుడిగా ఉంటున్నాయి. ఓ వైపు ప్రధానపార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటూనే.. మరోవైపు తమ హామీలను ప్రజాక్షేత్రంలో వివరిస్తున్నాయి. మొత్తంగా రాజకీయ రణరంగం రచ్చరచ్చగా సాగుతోంది. జాతీయ పార్టీల అగ్రనాయకులు దిల్లీ నుంచి వచ్చి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయం అన్నారు ప్రధాని మోదీ.

ఆయన అంత విశ్వాసంగా చెప్పడానికి కారణమేంటి? జాతీయస్థాయిలో కులగణన, ఓబీసీ రిజర్వేషన్ల పెంపుపై స్పష్టమైన విధానం చెప్పకుండా.. బడుగులకు పెద్దపీట వేశాం అని చెబితే ఆ వర్గాల వారు కన్విన్స్ అవుతారని అనుకుంటున్నారా? కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని మరోసారి ప్రధాని అభియోగం మోపారు. అయితే ఈ నేపథ్యంలో ఏయే పార్టీలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి.. వారు ప్రస్తుతం ఏ స్థానాల్లో ఉన్నారు..? వారి గెలుపుకు ఉన్న ఛాన్సెస్‌ ఎంత..? అనే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.