prathidhwani అధికార పక్షంపై ఉమ్మడి పోరుకు.. కూటములు, ఎత్తుగడలతో ఏకమవుతున్న విపక్షాలు

By

Published : Jun 24, 2023, 10:25 PM IST

thumbnail

prathidhwani: 2024 లోక్‌సభ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతున్నాయి. ఆయా పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామన్న ప్రతిపక్షాలు ప్రకటించగా.. మీ వల్ల కాదన్న బీజేపీ..300 స్థానాల్లో మాదే గెలుపన్న కమలనాథులు ప్రకటిస్తున్నారు. అసలు ప్రతిపక్షాలు నిర్మించే ప్రత్యామ్నాయాల సక్సెస్ రేట్‌ ఎంత? గతంలో నిర్మించిన కూటములు ఎందుకు విఫలమయ్యాయి.. గత కూటముల వైఫల్యాల నుంచి నేతలు  ఏం పాఠాలు నేర్చుకున్నారు. ప్రాంతీయ పార్టీల బలహీనతలను ఆసరాగా చేసుకొని బీజేపీ దెబ్బకొడుతుంటే...  గత అనుభవాల ప్రాతిపదికగా  కూటమి నేతలు కొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తున్నారు.ఈ నేపథ్యంలో గతంతో కంటే ఆయా పార్టీల మధ్య పెరిగిన ఐక్యత పెరిగినట్లు కనిపిస్తుంది. మోదీ సర్కారును గద్దె దింపడమే లక్ష్యమంటూ  పట్నా వేదికగా కాంగ్రెస్‌ పార్టీ సహా 15   ప్రతిపక్ష పార్టీల అధినేతలు ప్రతినబూనారు. ఇక అధికార పక్షంపై ఐక్య పోరాటమంటూ  విపక్షాలు ప్రకటించిన నేపథ్యంలో ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.