Peacock Dance in Nizamabad : మయూర నాట్యానికి మనుషులే కాదు.. పశుపక్ష్యాదులూ ఫిదా

By

Published : Aug 11, 2023, 11:41 AM IST

thumbnail

Peacock Dance in Nizamabad : అరణ్యాల్లో పశుపక్ష్యాదులు చెలిమితో మెలిగి.. కలసిమెలసి జీవిస్తున్నాయనే అంశాలపై మనం ఎన్నో కథలను వినే ఉంటాం.. కానీ అవే కథలు నిజ జీవితంలో ప్రతిబింబిస్తే ఎంత బాగుంటుందో కదా! తాజాగా అటువంటి సుందర దృశ్యమే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో చోటుచేసుకుంది. నాగన్​పల్లి  గ్రామ శివారులో పశువుల పాకలో పశువుల మధ్యకు వచ్చిన ఓ నెమలి పురివిప్పి నాట్యం చేసింది. మయూర నాట్యం చూపరులను మంత్ర ముగ్ధులను చేసింది. ఎంతో ఆసక్తిగా తిలకించి, పరవశించిన స్థానికులు తమ కెమెరాలలో ఆ మనోహరమైన దృశ్యాలను బంధించారు. ఈ వీడియోలో నెమలి పక్కనే గేదెలు, కోళ్లు కూడా మయూర నాట్యాన్ని చూసి పరవశించిపోయాయి.

Peacock Dance Video Viral : సాధారణంగా మగ నెమళ్లు నాట్యం చేస్తుంటాయి. ఈ నాట్యానికి ఆకర్శితమైన ఆడ నెమళ్లు దాని వద్దకు వస్తుంటాయి. అది కూడా వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు మాత్రమే మగ నెమళ్లు నాట్యం చేస్తుంటాయి. ఆడ నెమలి కంటే మగ నెమలి చూడడానికి చాలా అందంగా, పొడవాటి ఫించాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం నెమలి నాట్యం చేస్తున్న ఈ వీడియో సోషల్​ మీడియాలో కొందరు గ్రామస్థులు పంచుకున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.