వినూత్నంగా నామినేషన్​ వేసిన వీరబోగ వసంతరాయులు

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2023, 2:17 PM IST

thumbnail

Nomination Rally On Horse in LB Nagar : హైదరాబాద్​లోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వినూత్నంగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఓ అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకునే విధంగా గుర్రంపై కూర్చొని చేతిలో కత్తి పట్టి అందర్నీ ఆకర్షించేలా జోనల్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేెెెెెశారు. సామాజిక కార్యకర్త అయిన వీరబోగ వసంతరాయులు ఎల్బీనగర్ నుంచి జోనల్ కార్యాలయం వరకు గుర్రంపై వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ల పర్యంలో శుక్రవారం వీరబోగ వసంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

మరికొంత మంది ఎమ్మెల్యే అభ్యర్థులు రోడ్​షోలు నిర్వహించి.. తమ నామినేషన్లు వేస్తుంటే మరికొందరు బ్యాండ్​తో ప్రచారం చేస్తూ నామినేషన్​ దాఖలు చేస్తున్నారు. కొందరు తమ అనుచరుతో ర్యాలీగా తరలి వెళ్తున్నారు. నామినేషన్​ వేయడానికి వచ్చే ముందు కొందరు నేతలు పూజలు నిర్వహించి.. తమకు మద్దతుగా నిలిచే పార్టీ ముఖ్యనేతలను తమ వెంట తీసుకువస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.