గణపతి హోమం.. కార్మికులకు మోదీ సత్కారం.. ఘనంగా కొత్త పార్లమెంట్​ ప్రారంభ వేడుకలు

By

Published : May 28, 2023, 10:17 AM IST

thumbnail

New Parliament Building Inauguration : భారత దేశ చట్టసభలో నవ శకంగా నిలవనున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 7:30 గంటలకు కొత్త పార్లమెంట్​ భవనానికి చేరుకున్న ప్రధాని మోదీకి లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి మోదీ నివాళులు అర్పించారు. ఆత్మనిర్భరతకు ప్రతీకగా నిలవనున్న ఈ అధునాతన పార్లమెంటు భవంతి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా తొలుత గణపతి హోమం నిర్వహించారు. పూజ తర్వాత రాజదండం సెంగోల్​కు మోదీ సాష్టాంగ సమస్కారం చేశారు. ఈ పూజ కార్యక్రమాల్లో మోదీతో పాటు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా పాల్గొన్నారు. ఆ తర్వాత సెంగోల్​ను లోక్​సభలో మోదీ ప్రతిష్ఠించారు. ఆ తర్వాత పార్లమెంటు భవన నిర్మాణ కార్మికులను సత్కరించి.. వారికి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పార్లమెంటు సౌధాన్ని ప్రారంభించారు. అనంతరం సర్వమత పార్థనలు నిర్వహించారు. పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.