Nara Bhuvaneshwari Mulakat Application Rejected: నారా భువనేశ్వరి చంద్రబాబుతో ములాఖత్​కు​ దరఖాస్తు.. తిరస్కరించిన జైలు అధికారులు

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 2:19 PM IST

Updated : Sep 15, 2023, 8:31 PM IST

thumbnail

Nara Bhuvaneshwari Mulakat Application Rejected: రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేయగా అధికారులు తిరస్కరించారు. చంద్రబాబును కలిసేందుకు వారానికి మూడుసార్లు ములాఖత్​కు అవకాశం ఉన్నా సరే.. జైలు అధికారులు తిరస్కరించారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ములాఖత్ పైనా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ములాఖత్​కు అవకాశం ఉన్నా అధికారులు కాదని అనటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమహేంద్రవరంలోనే నారా భుననేశ్వరి ఉంటున్నారు. 

అసలెేం జరిగిందంటే: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును ములాఖత్​ కోసం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. ఇప్పటికే ఆమె ఓ సారి చంద్రబాబుతో ములాఖత్​ అయ్యారు. అవకాశం ఉన్న సందర్భంలో కూడా జైలు అధికారులు ములాఖత్​కు అనుమతివ్వకపోవటంపై.. టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

స్పందించిన జైళ్ల శాఖ: రిమాండ్‌లో ఉన్నవారికి వారంలో రెండుసార్లే ములాఖత్‌ ఇస్తామని... జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ రవికిరణ్‌ వివరణ ఇచ్చారు. ములాఖత్‌ను ఈ నెల 12, 14 తేదీల్లో ఉపయోగించుకున్నారన్న ఆయన... అత్యవసర పరిస్థితుల్లోనే మూడో ములాఖత్‌కు అనుమతిస్తామని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితి అని చెప్పలేదు కనుక భువనేశ్వరికి ములాఖత్‌ ఇవ్వలేదని తెలిపారు. అదే సమయంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ 4 రోజుల సెలవుపైనా పత్రికా ప్రకటన విడుదల చేసిన జైళ్ల ఉపశాఖాధికారి... రాహుల్‌ భార్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారని... నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరారని చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసుకునేందుకు రాహుల్‌ పెట్టిన 4 రోజుల సెలవు అభ్యర్థనను జైళ్ల శాఖ అంగీకరించిందని వెల్లడించారు. రాహుల్‌ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.

Last Updated : Sep 15, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.