బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అర్హులైన మహిళలందరికి పింఛన్లు : కవిత

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 4:33 PM IST

thumbnail

MLC Kavitha Roadshow in Nizamabad : బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి మహిళకు.. సౌభాగ్య లక్ష్మి పేరిట రూ. 3000 పింఛన్​ ఇస్తామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బీఆర్​ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్​ ఎమ్మెల్యే షకీల్​కు మద్ధతుగా.. నవీపేట గ్రామంలో ఎమ్మెల్సీ కవిత రోడ్​షో నిర్వహించారు. 

BRS Election Campaign 2023 : ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు రూ.200 ఉన్న పెన్షన్​ను సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే మొదటిసారి​ రూ. 1016, రెండోసారి రూ. 2016కు పెంచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన మాట తప్పరని.. ఈసారీ అధికారంలోకి రాగానే రూ. 3000 పింఛన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.​ ప్రతిపక్షాలు చెప్పే మాయమాటలు నమ్మవద్దని.. పదేళ్ల రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓటేయ్యాలని ప్రజలను కోరారు. కేసీఆర్​ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి ఇంతటితో ఆగొద్దంటే.. బీఆర్​ఎస్​ పార్టీకే మూడోసారీ ఓటువేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.