నిలోఫర్‌ కేఫ్​లో సందడి చేసిన కేటీఆర్‌

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2023, 7:14 PM IST

thumbnail

Minister Ktr Visit Niloufer Cafe  : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ బీజీగా ఉన్న మంత్రి కేటీఆర్‌ (KTR) నీలోఫర్ కేఫ్‌లో సందడి చేశారు. ఓ ఇంటర్వ్యూ కోసం బంజారాహిల్స్‌లోని నీలోఫర్ కేఫ్‌కు వెళ్లిన కేటీఆర్.. అక్కడున్న వారిని పలకరించారు. వారితో కలిసి చాయ్ తాగుతూ సరదాగా మాట్లాడారు. చిన్నారిని ఎత్తుకుని ఆడించారు. ఈ క్రమంలో కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ఉత్సాహం చూపించారు. రాష్ట్రాభివృద్ధి, హైదరాబాద్​లో పరిస్థితులు, తమ స్వరాష్ట్రాల స్థితిగతులను అక్కడున్న వారు కేటీఆర్ తో పంచుకున్నారు. 

కేటీఆర్​తో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ఉత్సాహం చూపించారు. అలాగే మంత్రి కేటీఆర్​ నియోజకవర్గాల్లో జరుగుతున్న బీఆర్​ఎస్​ సభలకు వెళుతూ.. రోడ్​ షోలలో పాల్గొంటున్నారు. ఈ రోజు చిట్యాలలో రోడ్​ షోలో పాల్గొన్న కేటీఆర్.. అనంతరం ఎల్బీనగర్​ వద్ద నాగోల్​లో తెలంగాణ టెక్స్​టైల్ హ్యాండ్​లూమ్ కార్మికుల సదస్సులో పాల్గొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకున్న, తీసుకోబోయే చర్యల గురించి వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.