డివైడర్​ దాటుకుని వచ్చి లారీ బీభత్సం- భయంతో జనం పరుగులు- లైవ్​ వీడియో

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 9:39 AM IST

thumbnail

Mangalore Lorry Accident Live Video : కర్ణాటక మంగళూరులో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ముల్కి జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ లారీ, అదుపుతప్పి సర్వీస్ రోడ్డుపైకి దూసుకొచ్చింది. డివైడర్​ను దాటుకుని వచ్చి మరీ రోడ్డుపై వెళ్తున్న వాహనాలను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఉదయం 9.30 గంటలకు జరిగింది.

ఇదీ జరిగింది
హెజమది నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ లారీ, ముల్కి జంక్షన్​ వద్దకు చేరుకోగానే అదుపు తప్పింది. సర్వీస్ రోడ్డుపైకి వేగంగా ప్రవేశించి ముందుగా వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. డివైడర్​ను దాటుకుని వచ్చి ఆటో, స్కూటర్లను ఢీకొట్టింది. అనంతరం మళ్లీ సర్వీస్​ రోడ్డు డివైడర్​ను దాటుకుని మెయిన్​ రోడ్డుపైకి ఎక్కి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో సంగప్ప (45) అనే వాచ్​మన్​కు తీవ్రగాయాలు అయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు లారీని, డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. లారీ దూసుకుని వస్తుండడాన్ని గమనించిన స్థానికులు పరుగులెత్తడం సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.