బీఆర్​ఎస్​ నేతలు, కార్పొరేటర్లకు తన పేరుతో బెదిరింపు ఫోన్‌కాల్స్‌ చేస్తున్నారు : మర్రి రాజశేఖర్​రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 9:58 PM IST

thumbnail

Malkajgiri MLA Complaint on Threatening Calls : గత కొన్ని రోజులుగా బీఆర్​ఎస్​ నాయకులు, కార్పొరేటర్లకు తన పేరుతో బెదిరింపు కాల్స్ చేస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకోవాలని నేరేడ్​మెట్​లోని రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. 

BRS MLA Marri Rajasekhar Reddy Complaints on Spoof Calls : కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీఆర్​ఎస్​ నేతలకు, కార్పొరేటర్లకు తన పేరుతో స్పూఫ్​ కాల్స్​ చేస్తున్నారని మర్రి రాజశేఖర్​రెడ్డి అన్నారు. బీఆర్​ఎస్ నేతల కుటుంబాలను నాశనం చేస్తామని, భార్యబిడ్డలను చంపుతామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచినందుకు తమపై కొందరు నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. తమకు వచ్చిన బెదిరింపు కాల్స్​ను రికార్డు చేశామని త్వరలో మీడియాకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయమై సీపీకి ఫిర్యాదు చేశామని త్వరలో దుండగులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారని చెప్పారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.