Long White Python In Karnataka: శ్వేతవర్ణంలో 9 అడుగుల కొండచిలువ... అరుదైన సర్పాన్ని చూశారా?

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 12:18 PM IST

thumbnail

Long White Python In Karnataka : కర్ణాటకలో 9 అడుగుల పొడవైన తెల్లని కొండచిలువ కనువిందు చేసింది. ఉత్తర కన్నడ జిల్లలోని కుంమ్టా తాలుకా హేగ్దే గ్రామంలో ఈ సర్పం కనిపించింది. కొండచిలువను గ్రామంలోని దేవి నారాయణ్​ ముక్రీ.. తన ఇంటి పరిసరాల్లో మంగళవారం అర్ధరాత్రి గమనించారు. వెంటనే ఆయన పాములను పట్టే పవన్​ నాయక్​కు సమాచారం అందించారు. సాధారణంగా కొండచిలువలో పిగ్మెంట్ లోపించడం వల్ల తెల్లగా మారతాయని పవన్ నాయక్​ తెలిపారు. ఈ గ్రామంలో ఇటువంటి కొండచిలువ కనిపించడం రెండోసారని పవన్​ నాయక్ తెలిపారు. గత సంవత్సరంలో కనిపించిన కొండచిలువ కంటే ఇది మూడు రెట్లు పెద్దగా ఉందని నాయక్​ చెప్పారు. ఇలాంటి కొండచిలువలు పుట్టిన తరవాత ఎక్కువకాలం బతకడం కష్టమని, ఇతర జంతువుల చేతిలో చనిపోతాయని ఆయన చెప్పారు. కొండచిలువ తొమ్మిది అడుగుల పొడవు ఉందని తెలిపారు. దీనికి సుమారు ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుందని నాయక్ అన్నారు. అనంతరం పవన్​ నాయక్ కొండచిలువను కుమట అటవీ అధికారులకు అప్పగించారు. అధికారులు కొండచిలువను మైసూరు జంతుప్రదర్శన శాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.