'కేవలం ప్లైఓవర్ల నిర్మాణాలే అభివృద్ధి పనులుగా అధికార పార్టీ చూపిస్తోంది'

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2023, 7:21 PM IST

thumbnail

LB Nagar BJP Candidate Sama Ranga Reddy Election Campaign : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ తేదీ సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. వివిధ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలకు ఎన్నికల హామీలను వివరిస్తూ.. తమ పార్టీకే ఓటు వేయాలని అగ్ర నాయకులు సైతం కోరుతున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి మన్సూరాబాద్ డివిజన్​లో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 

ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారని, తమ పార్టీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉండగా.. ప్లైఓవర్ల నిర్మాణాలే అభివృద్ధి పనులుగా అధికార పార్టీ చెప్పుకుంటోందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. రాత్రి వేళ కొందరు మీటింగ్​లు పెట్టి మద్యం, డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.