3,782 మంది చిన్నారుల కూచిపూడి నృత్యం - గిన్నిస్​ రికార్డు దాసోహం

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 10:45 PM IST

thumbnail

Kuchipudi Show Guinness World Record in Hyderabad : తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతో భారత్‌ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించిన కూచిపూడి ప్రదర్శన గిన్నిస్ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఇందుకు హైదరాబాద్​లోని గచ్చిబౌలి స్టేడియం వేదికైంది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్ ప్రతినిధి సమక్షంలో 3,782 మంది చిన్నారులు కూచిపూడి నృత్యం చేయడంతో గిన్నిస్ వరల్డ్‌ రికార్డు నెలకొల్పారు. 

Guinness World Record Kuchipudi Show video : రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇన్నిరోజులు కార్యక్రమాల్లో ఒక్కరిగా ప్రదర్శన ఇవ్వడానికి భిన్నంగా వేల మంది కళాకారులతో కలిసి ఇవ్వడం మరచిపోలేని అనుభూతి ఇచ్చిందన్నారు. గిన్నిస్‌ రికార్డు సాధనలో భాగస్వాములు కావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.